
చిత్రసీమలో హీరోయిన్ గా కొనసాగాలంటే ముందుగా కావాల్సింది గ్లామర్. అయితే కొంతమంది హీరోయిన్లకు గ్లామర్ పుష్కలంగా రాణించలేకపోతున్నారు. ఇందులో ఒకరు అనూ ఇమ్మాన్యుయిల్. ఈ అమ్మడికి అందం పుష్కలంగా అదృష్టంగా మాత్రం కలిసి రావడం లేదు. కెరీర్ తొలినాళ్లలో అగ్రహీరోలతో నటించిన ఈ భామ సరైన హిట్టులేక కనుమరగయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో అమ్మడు తెలివిగా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ దర్శక, నిర్మాతలను ఆకట్టుకునే పడిలో పడింది. తాజాగా ఆమె అందాలకు ఫిదా అయిన ఓ యంగ్ దర్శకుడు తన సినిమాలో అవకాశం ఇచ్చాడు.
అఖిల్ హీరోగా నటించిన ‘మజ్ను’ చిత్రం ద్వారా అనూ టాలీవుడ్ ప్రేక్షకుల పరిచమైంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో నటించే ఛాన్స్ దక్కించుకుంది. పవన్ తో నటించిన ‘అజ్ఞాతవాసి’ ఆమెకు నిరాశనే మిగిల్చింది. బన్నీతో నటించిన ‘నాపేరు సూర్య’ అమ్మడికి సరైన విజయాన్ని అందించ లేకపోయింది. నాగచైతన్యతో నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ మాత్రం పర్వాలేదనిపించింది. దీంతో ఈ భామ సినిమాల్లో నటిస్తే ప్లాప్ అవుతుందనే ప్రచారం కావడంతో అవకాశాలు తగ్గుముఖంగా పట్టాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా ఛాన్సులపై అనూ ఆసక్తికరంగా స్పందించింది.
తనకు సినిమా పరిశ్రమ కొత్త కావడంవల్లే మొదట్లో తడబడినట్లు చెప్పింది. అలాగే తనకు ఏ కథలు ఎంచుకోవాలో తెలిసేది కాదని పేర్కొంది. అంతేకాకుండా దర్శకులు కేవలం సినిమాలో తన పాత్ర వరకు మాత్రమే విన్పించేవారని చెప్పింది. సినిమా గురించి పూర్తిగా తెలియకపోవడంతోనే ఆ మూవీలు ప్లాప్ అయ్యాయని అంటోంది. ఇక నుంచి అలాంటి తప్పులు చేయనని స్పష్టం చేసింది. తన వద్దకు పూర్తి స్ర్కిప్టుతో వచ్చినవారి కథలనే వింటున్నానని.. మిగతా వారిని మర్యాదగానే తిప్పి పంపిస్తున్నానని వివరించింది. ఆమె కెరీర్ గాడిలోనే లేని సమయంలో సినిమాపై అవగాహన పెంచుకోవడం మంచిదే అయినప్పటికీ ఈ నిర్ణయం తనకు ఏమేరకు కలిసొస్తుందో వేచి చూడాల్సిందే..