Homeఎంటర్టైన్మెంట్Ante Sundaraniki 3 Days Collections: అంటే సుందరానికి 3 రోజుల వసూళ్లు

Ante Sundaraniki 3 Days Collections: అంటే సుందరానికి 3 రోజుల వసూళ్లు

Ante Sundaraniki 3 Days Collections: న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన అంటే సుందరానికి సినిమా ఇటీవలే విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..టాక్ అద్భుతంగా వచ్చినప్పటికీ కూడా ఎందుకో ఈ సినిమా మొదటి రోజు నుండి బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి వసూళ్లను రాబట్టలేకపోతుంది..సాధారణంగా నాని సినిమాలకు టాక్ వస్తే థియేటర్స్ కి ఫామిలీ ఆడియన్స్ క్యూ కడుతారు..కానీ అంటే సుందరానికి సినిమా కొన్ని చోట్ల మినహా..మిగిలిన ప్రాంతాలలో ఆశించిన స్థాయి లో ఆడడం లేదు..చాలా కాలం తర్వాత వచ్చిన నాని రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా కావడం తో ఈ మూవీ ని భారీ రేట్స్ కి కొనుగోలు చేసారు బయ్యర్లు..ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ని అన్ని ప్రాంతాలకు కలిపి దాదాపుగా 30 కోట్ల రూపాయలకు కొన్నారు అట..కానీ తోలి వీకెండ్ లో ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు చూస్తుంటే ఫుల్ రన్ లో నష్టాలు తప్పేలా లేవు అని భయపడుతున్నారట బయ్యర్లు..ఇంతకీ ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

Ante Sundaraniki 3 Days Collections
Ante Sundaraniki

Also Read: Radhika Apte: అవి పెద్దగా లేవని రిజెక్ట్ చేశారు… లెజెండ్ హీరోయిన్ రాధికా ఆఫ్టే సంచలన ఆరోపణలు!

మొదటి రోజు ఈ సినిమాకి ట్రేడ్ పండితులు ఆశ్చర్యపొయ్యే విధంగా కేవలం 3 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ మాత్రమే వచ్చింది..ఇది నాని కెరీర్ లోనే వీక్ ఓపెనింగ్ గా చెప్పుకోవచ్చు..ఎందుకంటే అతి తక్కువ టికెట్ రేట్స్ మీద విడుదల అయినా నాని గత చిత్రం శ్యామ్ సింగ రాయ్ దాదాపుగా 4 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..కానీ అంటే సుందరానికి సినిమాకి టికెట్ రేట్స్ కలిసి వచినప్పట్టికి కూడా ఎందుకో చాలా తక్కువ ఓపెనింగ్ వచ్చింది..ఇక రెండవ రోజు మరియు మూడవ రోజు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ వసూళ్లను రాబడుతూ వీకెండ్ మొత్తానికి కలిపి 12 కోట్ల రూపాయిలు షేర్ ని వసూలు చేసింది..ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి మూడు రోజులకు గాను ఈ సినిమా 15 కోట్ల రూపాయిలు వసూలు చేసింది అని ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త..ఇది డీసెంట్ వసూళ్లే అయ్యినప్పటికీ కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలి అంటే నాల్గవ రోజు నుండి కచ్చితంగా మంచి వసూళ్లను రాబట్టాలి..కానీ ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ట్రెండ్ ని చూస్తూ ఉంటె అది సాధ్యపడేట్టు అనిపించడం లేదు..ఫుల్ రన్ లో కనీసం 5 కోట్ల రూపాయిల నష్టాలు వాటిల్లో అవకాశం ఉంది ట్రేడ్ పండితులు చెప్తున్నారు..కానీ నాని కి ఫామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఫుల్ గా ఉండడం..దానికి తోడు సినిమా కూడా బాగుండడం తో రెండవ వీకెండ్ బాగా కలిసి వస్తుందనే ఆశతో ఉన్నారు బయ్యర్లు..మరి వారి ఆశలను ఈ సినిమా నిజంగా చేస్తుందో లేదో చూడాలి.

Also Read: Balakrishna Fans Fire On NTR: బాలయ్య అంటే కనీస మర్యాద లేదా… ఎన్టీఆర్ పై మండిపడుతున్న ఫ్యాన్స్!

Recommended Videos:
Ante Sundaraniki 3rd Day Box office Collections || Nani || Oktelugu Entertainment
ప్రజల కోసం నా కుటుంబం.. || Pawan Kalyan Emotional Words About Sai Dharam Tej , Varun Tej, Niharika
కౌలు రైతులకు అండగా మెగా ఫ్యామిలీ || Mega Family Donation to Farmers || Koulu Rythu Bharosa Yatra

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version