18 Pages Release Date: హీరో నిఖిల్ వరుస ప్రాజెక్ట్స్ తో జోరుమీదున్నాడు. ఆ మధ్య కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఈ యంగ్ హీరో ట్రాక్ లోకి వచ్చాడు. 2016లో విడుదలైన ఎక్కడికి పోతావుచిన్నవాడా మూవీతో సూపర్ హిట్ కొట్టిన నిఖిల్ కి కేశవ, కిరాక్ పార్టీ చిత్రాలు షాక్ ఇచ్చాయి. ఇక అర్జున్ సురవరం మూవీ విషయంలో అనేక ఇబ్బందులకు గురయ్యాడు. కొందరు మోసగాళ్ల చేతుల్లో చిక్కుకున్న అర్జున్ సురవరం విడుదల ఆలస్యమైంది. అనేక ప్రయాసల మధ్య విడుదలైన అర్జున్ సురవరం హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ప్రస్తుతం నిఖిల్ ఖాతాలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో రెండు విడుదలకు సిద్ధమయ్యాయి. 2014లో విడుదలైన సస్పెన్సు థ్రిల్లర్ కార్తికేయ సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఆ చిత్ర దర్శకుడు చందూ మొండేటి కార్తికేయ 2 తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై 22న విడుదల కానుంది. అలాగే నిఖిల్ దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తో 18 పేజెస్ అనే మూవీ చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.
Also Read: Radhika Apte: అవి పెద్దగా లేవని రిజెక్ట్ చేశారు… లెజెండ్ హీరోయిన్ రాధికా ఆఫ్టే సంచలన ఆరోపణలు!
షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తుండగా విడుదలకు సిద్ధం చేస్తున్నారట. 18 పేజెస్ మూవీ సెప్టెంబర్ 10న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. 18 పేజెస్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్2, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 18 పేజెస్ మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ నడుస్తుంది. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
కాగా నిఖిల్ ఇటీవల స్పై టైటిల్ తో పాన్ ఇండియా చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో నిఖిల్ అండర్ కవర్ ఏజెంట్ గా నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేయగా విశేష ఆదరణ దక్కింది. నిఖిల్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో స్పై తెరకెక్కుతుంది.హిందీ,తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. గ్యారీ బి హెచ్ స్పై చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. కె రాజశేఖర్ రెడ్డి, చరణ్ తేజ్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు.
Also Read:Radhika Apte: అవి పెద్దగా లేవని రిజెక్ట్ చేశారు… లెజెండ్ హీరోయిన్ రాధికా ఆఫ్టే సంచలన ఆరోపణలు!