Samantha wants divorce : చైతు – సమంత విడాకులకు ముఖ్య కారణం ఇదే అంటూ అనేక పుకార్లు పుట్టించారు. అయితే, తాజాగా ఈ అంశం పై నాగార్జున స్పందించాడు. పైగా సమంత, నాగచైతన్య విడాకుల పై నాగార్జున షాకింగ్ కామెంట్స్ చేశాడు. నాగార్జున మాట్లాడుతూ.. ‘సమంతే తొలుత విడాకులు కావాలని కోరిందని, ఆమె నిర్ణయాన్ని గౌరవించిన చైతూ అందుకు అడ్డుచెప్పలేకపోయాడని నాగ్ చెప్పుకొచ్చాడు.

నాగ్ ఇంకా మాట్లాడుతూ.. ‘చైతు – సమంత ఇద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు. 2021 న్యూ ఇయర్ వేడుకలు కూడా సంతోషంగా చేసుకున్నారు. సమంత నిర్ణయానికి కారణం నాకు తెలియదు. అయితే.. విడాకుల విషయంలో పరువు, మర్యాద గురించి చైతన్య ఎక్కువగా ఆలోచించాడు’ అని నాగార్జున తెలియజేశాడు. అయితే, సమంతే చైతుని విడాకులు అడిగింది’ అని నాగార్జున చెప్పడం నిజంగా షాకింగ్ విషయమే.
Also Read: పుష్ప మూవీ ఈ స్టార్స్ చేయాల్సింది.. ఎందుకు వదులుకున్నారు?
అయితే, సమంత రీసెంట్ గా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి విడాకుల ప్రకటన పోస్టును తొలగించడం సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశమైంది. సామ్-చై మళ్లీ కలుస్తున్నారు అంటూ రూమర్స్ మొదలయ్యాయి. అటు అభిమానుల్లోనూ ఈ చర్చ మొదలైంది. సమంత షాకింగ్ నిర్ణయం తీసుకుందని.. విడాకుల పోస్ట్ డిలీట్ వెనుక ఏదో కారణం ఉందని రూమర్స్ కూడా వినిపించాయి.

కానీ నాగార్జున అప్పుడు కూడా పూర్తి భిన్నంగా స్పందిస్తూ.. ; చైతు – సామ్ మళ్ళీ కలవక పోవచ్చు’ అంటూ చెప్పాడు.ఏది ఏమైనా మొత్తానికి ప్రేమించి పెళ్ళి చేసుకున్న నాగచైతన్య-సమంత వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. ఒకవేళ నాగ్ చెప్పింది నిజమే అయితే.. సమంత షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లే.
Also Read: ధనుష్ కి హెల్త్ బాగాలేదు.. కానీ ప్రేమ పాటతో ఐశ్వర్య బిజీ !
[…] […]