Mahesh And Rajamouli Movie: మహేష్(Super Star Mahesh Babu) , రాజమౌళి(SS Rajamouli) మూవీ షూటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ని ఎంత గోప్యంగా ఉంచాలని చూసిన ఆగడం లేదు. వారానికి ఒక లీక్ జరుగుతూనే ఉంది. రాజమౌళి షూటింగ్ లొకేషన్ లో మొబైల్ ఫోన్స్ ని అనుమతించకపోయిన కూడా ఎక్కడి నుండో లీక్ అయిపోతున్నాయి. మూవీ టీం అభిమానుల కోసం కావాలని లీక్ చేస్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. రెండు వారాల క్రితమే సౌత్ ఆఫ్రికా లో షూటింగ్ చేస్తున్న సమయం లో మహేష్ బాబు కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి. ఆ ఫోటోలలో మహేష్ పక్కన సింహం కూడా ఉండడం విశేషం. దీనిని చూసి అసలు మా హీరో తో రాజమౌళి ఎలాంటి మూవీ ని ప్లాన్ చేస్తున్నాడో అని అభిమానులు ఇప్పటి నుండే ఊహించుకుంటున్నారు. కానీ రాజమౌళి మన ఊహలకు అందని వాడు అనే విషయాన్నీ మాత్రం అభిమానులు మర్చిపోయారు.
కచ్చితంగా వాళ్ళు కలలో కూడా ఊహించని కాన్సెప్ట్ తోనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది. మహేష్ బాబు పై కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక అభిమాని మహేష్ ని తన కెమెరా తో షూట్ చేస్తూ ఆ వీడియో ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేయగా అది బాగా వైరల్ అయ్యింది. స్టైలిష్ అద్దాలు పెట్టుకొని, గుబురు గెడ్డం తో, నెత్తిన క్యాప్ పెట్టుకొని, చేతిలో గొడుగు పట్టుకొని, సైడ్ యాంగిల్ లో మహేష్ ఎవరినో చూస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా మహేష్ బాబు లుక్స్ ఫ్యాన్స్ ని పిచ్చెక్కించేలా ఉన్నాయి. గెటప్ లో లేకపోయినా కూడా మహేష్ ఇంత అందంగా ఉండడం ని చూసి మహేష్ ఫ్యాన్స్ ఎంతో మురిసిపోతున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ ని నవంబర్ నెలలో కనీవినీ ఎరుగని రీతిలో రివీల్ చేస్తామని, అభిమానుల ఎదురు చూపులకు ఈ అప్డేట్ నూటికి నూరు పాళ్ళు సంతృప్తి ని ఇస్తుందని, మహేష్ ఫ్యాన్స్ గర్వంగా ఫీల్ అవుతారని రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో, రామాయణం ఇతిహాసానికి లింక్ ఉన్న చిత్రమిది. ఇందులో మహేష్ బాబు శ్రీరాముడి కుటుంబం లోని 43 వ తరానికి చెందిన వాడిగా కనిపించబోతున్నాడు. అంతే కాదు ఈ సినిమాలో ఆయన శ్రీరాముడి లుక్ లో కూడా కనిపిస్తాడట. ఇండియన్ ఆడియన్స్ తో పాటు ఫారిన్ ఆడియన్స్ కూడా మెంటల్ ఎక్కిపోయే రేంజ్ స్టఫ్ తో రాజమౌళి మన ముందుకు రాబోతున్నాడు. 2027 వ సంవత్సరం మార్చి నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
#ssmb29 sets #maheshbabu #globetrotter pic.twitter.com/KmUlgZSzp8
— Siva DHFM (@sivadhfmforever) September 14, 2025