New GST Rates: సెప్టెంబర్ 22 నుంచి కొన్ని వస్తువులపై జిఎస్టి భారీగా తగ్గుతున్న విషయం తెలిసిందే. దీంతో చాలామంది ఈ తేదీ తర్వాత వస్తువులు కొనాలని చూస్తున్నారు. ఎందుకంటే ఆ తర్వాత వస్తువు ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని వస్తువులపై 12 శాతం నుంచి ఐదు శాతం వరకు జీఎస్టీ తగ్గించనున్నారు. దీంతో ఆ సమయంలోనే వస్తువులు కొనుగోలు చేయాలని అంటున్నారు. అయితే వాస్తవానికి సెప్టెంబర్ 22 కు ముందు కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం మంచిది. ఎందుకంటే ఈ వస్తువుల ధరలు ఆ తర్వాత భారీగా పెరుగుతుంటాయి. మరి సెప్టెంబర్ 22 కు ముందు కొనాల్సినా వస్తువులు ఏవో ఇప్పుడు చూద్దాం..
త్వరలో దసరా, దీపావళి పండుగలు రాబోతున్నాయి. వీటి సందర్భంగా కొత్త వస్తువులు కొనుగోలు చేయాలని చాలామంది అనుకుంటారు. కొందరు డబ్బు ఉన్నవారు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయాలని వెయిట్ చేస్తున్నారు. అయితే వీరు దసరా దీపావళికి ఆగకుండా సెప్టెంబర్ ముందే కొనుగోలు చేయడం మంచిది. ప్రస్తుత కాలంలో చాలామంది సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్ లో వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి ప్రదేశాల్లో వస్తువులు కొనుగోలు చేసినప్పుడు బిల్లు దాదాపు రూ.2,500 కంటే ఎక్కువ అవకాశం ఉంది. ఇలా ఒకేసారి రూ. 2,500 కంటే ఎక్కువ మొత్తంలో వస్తువులు కొనుగోలు చేస్తే వీటిపై జిఎస్టి ప్రస్తుతం 12% తో కొనసాగుతోంది. సెప్టెంబర్ 22 తర్వాత వీటిపై 18% విధించే అవకాశం ఉంది. అందువల్ల ఈ మొత్తంలో వస్తువులు కొనాలని అనుకుంటే సెప్టెంబర్ 22 కంటే ముందే కొనుగోలు చేయడం మంచిది.
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొని దానిపై రైడ్ చేయాలని కోరుకోని యూత్ ఉండరు. అందులోనూ అప్గ్రేడ్ సీసీ కావాలని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. అయితే 350 కంటే ఎక్కువ సీసీ కలిగిన బైక్ కొనాలని అనుకునేవారు సెప్టెంబర్ 22 కంటే ముందే కొనుగోలు చేయాలి. ఎందుకంటే ఆ తర్వాత దీనిపై ఇప్పటివరకు 28% జిఎస్టి ఉండగా ఆ తర్వాత 40% వరకు జీఎస్టీ పెరిగే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 22 కంటే ముందే ఈ బైక్ ను కొనుగోలు చేస్తే రూ.15000 వరకు సేవ్ చేసుకోవచ్చు.
అలాగే కొందరు పార్టీస్ ఇవ్వాలని అనుకుంటారు. ఇలాంటివారు సెప్టెంబర్ 22 కంటే ముందే ఇస్తే బెటర్. ఆ తర్వాత వీటిపై కూడా జీఎస్టీ అధికంగా పెరిగే అవకాశం ఉంది. ఇలా కొన్నింటి వాటిపై జీఎస్టీ భారీగా పెరిగే అవకాశం ఉంది. అలాంటి వాటిని సెప్టెంబర్ 22 కంటే ముందే కొనుగోలు చేయడం మంచిది. అయితే మిగతా వస్తువులపై జిఎస్టి తగ్గే అవకాశం ఉంటుంది. వాటిని ఆ తర్వాత కొనుగోలు చేస్తే లాభపడతారు. కానీ లగ్జరీ వస్తువులకు మాత్రం సెప్టెంబర్ 22 కంటే ముందే మంచిదని కొందరు ఆర్థిక నిపుణులు పనులు తెలుపుతున్నారు.