https://oktelugu.com/

అనుష్క, కీర్తి సురేష్ బాటలో మరో టాప్ హీరోయిన్

చిత్ర పరిశ్రమలో దాదాపుగా సినిమాలన్నీ కధానాయకుడి పాత్ర మీద ఆధారపడి నిర్మాణమవుతాయి.హీరోలు రెండు మూడు దశాబ్దాల పాటు హీరోలాగానే హవా కొనసాగిస్తారు. కానీ హీరోయిన్ ల పరిస్థితి వేరుగా ఉంటుంది, కథానాయికలు అలా వచ్చి ఇలా పోతుంటారు, కొందరు మాత్రమే కొన్నాళ్లు మహా అయితే ఒక దశాబ్దం పాటు పరిశ్రమలో నిలబడతారు. అందువల్ల ఉన్న తక్కువ కాలంలో సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాలు చేసుకుని నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు. విభిన్న పాత్రలలో నటించాలని మనసులో ఉన్నా వచ్చిన గ్లామర్ […]

Written By:
  • admin
  • , Updated On : December 23, 2020 / 05:54 PM IST
    Follow us on


    చిత్ర పరిశ్రమలో దాదాపుగా సినిమాలన్నీ కధానాయకుడి పాత్ర మీద ఆధారపడి నిర్మాణమవుతాయి.హీరోలు రెండు మూడు దశాబ్దాల పాటు హీరోలాగానే హవా కొనసాగిస్తారు. కానీ హీరోయిన్ ల పరిస్థితి వేరుగా ఉంటుంది, కథానాయికలు అలా వచ్చి ఇలా పోతుంటారు, కొందరు మాత్రమే కొన్నాళ్లు మహా అయితే ఒక దశాబ్దం పాటు పరిశ్రమలో నిలబడతారు. అందువల్ల ఉన్న తక్కువ కాలంలో సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాలు చేసుకుని నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు. విభిన్న పాత్రలలో నటించాలని మనసులో ఉన్నా వచ్చిన గ్లామర్ పాత్రలని వద్దనకుండా ఒప్పుకుంటారు.

    Also Read: మెగా ఫ్యాన్స్ ను టెన్షన్ లో పెట్టిన మంచు విష్ణు !

    ఎప్పుడో ఒకసారి ఏ దర్శకుడో ప్రయోగం చేయాలనుకుని ఒక కథానాయికతో హీరోయిన్ సెంట్రిక్ మూవీ తీసి హిట్ కొడితే ఆ తర్వాత ఆమెకు అలాంటి మూవీ ఆఫర్స్ ఎక్కువగా వస్తాయి. మూవీ మొత్తం హీరోయిన్ తన భుజాల మీద వేసుకుని నడిపించటమంటే చాలా పెద్ద విషయమే. అలాంటి హీరోయిన్స్ తెలుగు సినీ చరిత్రలో వేళ్ళ మీద లెక్కపెట్టుకునేంత మంది మాత్రమే ఉన్నారు. ఈ తరంలో అనుష్క, కీర్తి సురేష్ లు మాత్రమే ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీలో నటించి హిట్ ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వారి వరుసలో టాప్ హీరోయిన్ పూజ హెగ్డే చేరబోతుందని ఇండస్ట్రీలో గుస గుసలాడుతున్నారు.

    Also Read: బాలీవుడ్ లో అడుగుపెడుతున్న విలక్షణ నటుడు

    ప్రస్తుతం వరుస హిట్స్ తో జోరు మీద ఉన్న ఈ భామ ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’, అఖిల్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ సినిమాలు చేస్తుంది.ఈ రెండు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. వచ్చే ఏడాది ఆమె మూడు హిందీ ప్రాజెక్ట్ లని అలాగే తమిళంలో ఒక సినిమాకి ఓకే చెప్పింది.ఇదే ఊపులో క్రేజ్ ఉన్నప్పుడే నటిగా కూడా బెస్ట్ అనిపించుకునే సినిమాలు చేయాలని అనుకుంటున్న తరుణంలో గుణశేఖర్ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించబోతున్న ప్రేమకావ్యం “శాకుంతలం” సినిమాలో టైటిల్ రోల్ కోసం పూజా హెగ్డేతో మాట్లాడినట్లు తెలుస్తుంది.ఆ పాత్ర నచ్చటంతో ఆ మూవీ చేయడానికి పూజ హెగ్డే ఆసక్తి కనబరుస్తుందట. రెమ్యూనరేషన్ తక్కువ అయినప్పటికీ ఈ మూవీ చేయటానికే మొగ్గు చూపిస్తుందట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్