SVR: తెలుగు తెరకు లభించిన గొప్ప నటుల జాబితాలో కోట శ్రీనివాసరావు కూడా ఒకరు. ఒక నటుడు ఒక ఎమోషన్ ను బాగా పలికించగలరు ఏమో, కానీ ఒక నటుడు రౌద్రం, కపటత్వం, ఆవేదన, హాస్యం, మందహాసం ఇలా ఒకటి ఏమిటి ? కోట చేయని పాత్ర లేదు, కోట పండించని భావోద్వేగం లేదు. నటుడిగా కోట ఎప్పటికీ తరగని కోటగానే నిలిచిపోతారు. ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.
‘అయినా అవినీతి ఏడ లేదు తంబీ .. అని తన చరిత్ర మొత్తం చెప్పే సన్నివేశం గణేష్ లో ఉంటుంది. “మనం బతకాలి తంబీ ” అన్న ఒక్క సీన్ తోనే ఎంతో మంచి నటనను కనబర్చారు. నిజంగా విలనిజం అనేదానికి కొత్త కోణాన్ని అద్దారు కోట. అదే కాదు .. శత్రువు అనే సినిమాలో కూడా కామెడీ విలన్ గా కొత్త పంధాను సృష్టించారు.
“దొరిపోయాను రా బాబోయ్” అన్న ట్రేడ్‌మార్క్ డైలాగ్ కోట నోటి నుంచి వచ్చింది కాబట్టే.. సూపర్ హిట్ అయింది. ఇక తెలంగాణ మాండలికంలో కథ చెప్తూ గొప్ప హాస్యం పండించారు. కేవలం హాస్యమే కాకుండా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అవకాశం వచ్చినప్పుడల్లా కోట దుమ్ము దులిపారు. కేవలం ఒక రకమైన నటనకే కాకుండా .. కోట గారు తనని తానూ ఆవిష్కరించుకుంటూ ముందుకు సాగారు.
Also Read: ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” అప్డేట్… ఫుల్ జోష్ లో డార్లింగ్ అభిమానులు
విల్లనిజం, కామెడీ, శాడిజం, క్యారెక్టర్ ఆర్టిస్ట్ , ఏడిపించడం, కోట పలానా నటన ఒకటే బాగా చేస్తారని చెప్పలేనంత బాగా ఆయన పాత్రలు పోషిస్తూ వచ్చారు. అయితే, కోట గారిని ఎక్కువగా విలన్ గా లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే చూసాము. విల్లనిజం, కామెడీ రెండు కలిపి పండించిన పాత్రలను చూశాము. ఎన్నీ చూసినా ఈ తరానికి మరో ఎస్వీయార్ ఆయన.
Also Read: Celebrity Weddings 2021: ఈ ఏడాది వివాహ బంధంలో అడుగుపెట్టిన సినీ ప్రముఖులు వీళ్లే..