https://oktelugu.com/

Heroine: హీరోయిన్ హ్యాండ్ ఇచ్చింది, హీరోగారి ఫోకస్ పెరిగింది !

Heroine: కిందనుంచీ పైకి వచ్చిన హీరో అతను. గతంలో చాలా కష్టాలు పడ్డాడు. అయితే, ఆ కష్టాలకు ప్రతిఫలంగా హీరో అయ్యాడు. హీరోగా సక్సెస్ అయ్యాడు. వరుస సినిమాలు వస్తున్నాయి. ఫుల్ ఫామ్ లో లేకపోయినా ఏవరేజ్ రేంజ్ హీరోగా ముద్ర పడ్డాడు. అంతా బాగుంది. ఇక్కడే ఆ హీరోగారికి కోరికలు కలిగాయి. ఒకప్పుడు ఎన్నో అవమానాలు, మరెన్నో బాధలు. అప్పుడు ఎలాగూ ఎంజాయ్ చేయలేకపోయాను. ఇప్పుడైనా ఎంజాయ్ చేయాలని ఆశ పడ్డాడు. ఆ ఆశలో కొన్ని […]

Written By:
  • Shiva
  • , Updated On : December 10, 2021 / 01:34 PM IST
    Follow us on

    Heroine: కిందనుంచీ పైకి వచ్చిన హీరో అతను. గతంలో చాలా కష్టాలు పడ్డాడు. అయితే, ఆ కష్టాలకు ప్రతిఫలంగా హీరో అయ్యాడు. హీరోగా సక్సెస్ అయ్యాడు. వరుస సినిమాలు వస్తున్నాయి. ఫుల్ ఫామ్ లో లేకపోయినా ఏవరేజ్ రేంజ్ హీరోగా ముద్ర పడ్డాడు. అంతా బాగుంది. ఇక్కడే ఆ హీరోగారికి కోరికలు కలిగాయి. ఒకప్పుడు ఎన్నో అవమానాలు, మరెన్నో బాధలు. అప్పుడు ఎలాగూ ఎంజాయ్ చేయలేకపోయాను. ఇప్పుడైనా ఎంజాయ్ చేయాలని ఆశ పడ్డాడు.

    Hero and Heroine

    ఆ ఆశలో కొన్ని ప్రేమ కథలు నడిపాడు. ఆ ప్రేమ అతనికి చివరకు అలవాటు అయింది. దాంతో ఆ హీరోకి ఎఫైర్లు కొత్తేమి కాదు అనే పేరు వచ్చేసింది. చాలా కాలం ఓ హీరోయిన్ తో సహజీవనం చేశాడు. ఆ హీరోయిన్ కి ఆఫర్లు కూడా ఇప్పించాడు. ఈ క్రమంలో అతనికి మరో హీరోయిన్ పరిచయం అయింది. ఆమె కూడా హీరోగారి నుంచి అవకాశాలు అందుకుంది.

    వీరిద్దరి మధ్య చాలా దూరం వెళ్లింది వ్యవహారం. వీరి పై అనేక కథనాలు ఆ మధ్య బాగా వైరల్ అయ్యాయి కూడా. అయితే, అంతలో ఆ హీరోయిన్ కి స్టార్ డమ్ వచ్చింది. ఆమె వెంటనే ఆ పుకార్లను తిప్పి కొట్టింది. పైగా సదరు హీరోని దూరం పెట్టింది. హీరో ఇగో హర్ట్ అయింది. ఇప్పుడు ఆ హీరోయిన్ వరుసగా స్టార్ హీరోలతో నటిస్తోంది.

    కానీ, ఈ హీరో మాత్రం ఇంకా చిన్న హీరోగానే మిగిలిపోయాడు. పైగా ఈ మధ్య రెండు సినిమాలు రిలీజ్ చేశాడు. అయినా ఆశించిన స్థాయిలో హిట్లు రాలేదు. నిజానికి ఆ స్టార్ హీరోయిన్ కి ఈ హీరో చాలా సాయం చేశాడు. ఒకవిధంగా ప్రేమించాడు కూడా. కానీ ఆ హీరోయిన్ మాత్రం, ఈ హీరోతో ఉంటే.. తన కెరీర్ కి ఎలాంటి ఉపయోగం లేదని ఆ హీరోయిన్ కి అర్ధం అయింది.

    Also Read: SVR: ఈ తరానికి మరో ఎస్వీయార్ ఆయన !

    అందుకే, ఈ హీరోకి దూరం జరిగింది. దాంతో హీరో ఒంటరి అయ్యాడు. మొత్తానికి ప్రియురాలు హ్యాండ్ ఇచ్చింది. అందుకే, ఈ హీరో మళ్ళీ సినిమాల పై ఫోకస్ పెట్టాడు. వరుస సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు.

    Also Read: Celebrities Died: 2021లో మృతిచెందిన టాలీవుడ్ సెలబ్రెటీలు..!

    Tags