Ustaad Bhagat Singh Teaser: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీజర్ గురించి మరో సెన్సేషనల్ అప్డేట్.. పవన్ ఫ్యాన్స్ కి ఇక ప్రతిరోజు పండగే!

సినిమా షూటింగ్ ఇంకా చాలా ఉంది కదా, అప్పుడే ఎడిటింగ్ వర్క్ ఎందుకు ప్రారంభించారు అనేది తొలుత అభిమానులకు అర్థం కాలేదు. కానీ మే 11 వ తేదీన ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని 'గబ్బర్ సింగ్' చిత్రం 11 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చెయ్యబోతున్నారు.

Written By: Vicky, Updated On : May 1, 2023 8:33 am
Follow us on

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ ‘గబ్బర్ సింగ్’ అనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ వచ్చి 11 ఏళ్ళు అయ్యింది. ఈ సినిమా అప్పట్లో ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే చిత్రం ద్వారా మరోసారి మన ముందుకు రాబోతున్నాడు.

రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలై ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.హీరోయిన్ శ్రీలీల కూడా కొన్ని రోజులు షూటింగ్ లో పాల్గొన్నది, సుమారుగా 10 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ కి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ ఈమధ్యనే ప్రారంభం అయ్యింది.

సినిమా షూటింగ్ ఇంకా చాలా ఉంది కదా, అప్పుడే ఎడిటింగ్ వర్క్ ఎందుకు ప్రారంభించారు అనేది తొలుత అభిమానులకు అర్థం కాలేదు. కానీ మే 11 వ తేదీన ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని ‘గబ్బర్ సింగ్’ చిత్రం 11 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చెయ్యబోతున్నారు. ఈ గ్లిమ్స్ వీడియో పూర్తి పవన్ కళ్యాణ్ మార్కుకి తగ్గట్టుగా ఊర మాస్ గా ఉండేట్టు కట్ చేశారట.

గ్లిమ్స్ వీడియో సిద్ధం గా ఉందని, ఇక దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తే గ్లిమ్స్ పూర్తి స్థాయిలో సిద్ధం అయ్యిపోయినట్టే అని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.నేడు దేవి శ్రీ ప్రసాద్ ని కలిసిన హరీష్ శంకర్ , ఆయనతో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చున్నాడు.ఇది కేవలం గ్లిమ్స్ వీడియో కోసమేనట. ఈ గ్లిమ్స్ వీడియో తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మీద ఆడియన్స్ మరియు ఫ్యాన్స్ లో ఉన్న హైప్ పదింతలు ఎక్కువ అవ్వబోతుంది అని చెప్పొచ్చు.