Senior Hero Naresh: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో లెజెండరీ స్థానం ని దక్కించుకున్న అతి తక్కువ మంది నటులలో ఒక్కరు నరేష్..కామెడీ హీరో గా అప్పట్లో ఈయనకి ఉన్న క్రేజ్ వేరు..నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తో పోటీగా ఈయన సినిమాలు ఆడేవి..హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న నరేష్..క్యారక్టర్ ఆర్టిస్టు గా ఇంకా ఎక్కువ సక్సెస్ లను చూసాడు..ప్రస్తుతం ఆయన లేని సినిమా అంటూ ఏది లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు..ఇటీవలే న్యాచురల్ స్టార్ నాని హీరో నటించిన అంటే సుందరానికి సినిమాలో తండ్రి పాత్ర పోషించి మంచి మార్కులే కొట్టేసాడు..క్యారక్టర్ ఆర్టిస్టుగా ప్రతి సినిమాతో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ ముందుకి దూసుకుపోతున్న నరేష్ గారి గురించి సోషల్ మీడియా లో గతకొద్ది రోజుల నుండి కొన్ని రూమర్స్ ప్రచారం అవుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఈ విషయాలపై నరేష్ ఇటీవల జరిగిన ఒక్క పర్సనల్ ఇంటర్వ్యూ లో సమాదానాలు చెప్పాడు.
ఇటీవల కాలం లో మీరు మూడు పెళ్లిళ్లు చేసుకున్న వార్త గురించి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..దీనికి మీరు ఏమి సమాధానం చెప్తారు,అని అడిగిన ప్రశ్న కి నరేష్ సమాధానం చెప్తూ ‘ప్రతి ఉద్యోగానికి ఎదో ఒక్క సెలవు దినం ఉంటుంది..ఒక నిర్దిష్ట టైమింగ్స్ ఉంటాయి..కానీ సినీ పరిశ్రమకి అలాంటివి ఏమి ఉండవు..మేము ఫామిలీ తో గడిపే కాలం కన్నా సెట్స్ గడిపే కాలమే ఎక్కువ..ఒక్కో సందర్భం లో నెలల తరబడి ఇంటికి రాని సందర్భాలు కూడా ఉన్నాయి.
Also Read: Telugu Heroine: ఆ క్రికెటర్ ప్రేమలో తెలుగు హీరోయిన్.. ఫోటో వైరల్ !
ఫోన్ లో మాట్లాడడానికి కూడా సమయం ఉండదు..ఇలాంటి బిజీ లైఫ్ కి సర్దుకుపోయ్యే అమ్మాయి దొరకడం చాలా కష్టం..సర్దుకోలేరు కూడా..నా జీవితం లో కూడా అదే జరిగింది..ఇలాంటి సమస్యలు సామాన్యులకు కూడా ఉంటాయి..కానీ మేము సెలబ్రిటీస్ కాబట్టి లైం లైట్ లోకి వస్తాము..ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సినిమానే నా జీవితం..అదే నా మొదటి పెళ్ళాం..దానిని నేను వదులుకోలేను’ అంటూ చెప్పుకొచ్చాడు నరేష్..ఇది ఇలా ఉండగా చాలా కాలం నుండి ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో నరేష్ డేటింగ్ లో ఉన్నాడని..త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని..ఇలా పలు రకాల వార్తలు ప్రచారం అయ్యాయి..వీటిపై నరేష్ మాట్లాడుతూ ‘ఈ కాలం లో పెళ్లి అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం..నిన్న గాక మొన్న పెళ్ళైన వారు కూడా విడాకులు తీసుకోవడం నేను గమనించాను..ఒక్కరి మనసుని ఒక్కరు అర్థం చేసుకొని తోడు గా ఉండడమే మంచిది..ప్రస్తుతం మేమిద్దరం అదే చేస్తున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు నరేష్.
Also Read:Anasuya: లంగా ఓణీలో ‘అనసూయ’ కసి చూపులు.. సిగ్గు మొగ్గలేసిన ఫోజులు !