Devara Movie: దేవర సినిమాకు వచ్చిన మరో చిక్కు..?

Devara Movie: అభిమానులు తప్ప మిగతా ప్రేక్షకులు ఎవరు ఈ సినిమా కోసం అంతగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టుగా అనిపించడం లేదు. కారణం ఏంటి అంటే ఈ సినిమా రిలీజ్ చాలాసార్లు డిలే అవుతూ వస్తుంది.

Written By: Gopi, Updated On : July 5, 2024 4:47 pm

Another problem for Devara movie

Follow us on

Devara Movie: సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకు చాలా మంచి హైప్ ఉంటుంది. మరికొన్ని సినిమాలకు మాత్రం అసలు హైపే ఉండదు. ఇక ఇంకొన్ని సినిమాలకు కొద్ది రోజులు హైప్ ఉంటుంది, మరి కొద్ది రోజులు హైప్ ఉండదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ‘ దేవర ‘ సినిమా మీద మొదట్లో మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. ఇక రోజులు గడిచే కొద్ది ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో అంత బజ్ అయితే క్రియేట్ అవ్వడం లేదు.

అభిమానులు తప్ప మిగతా ప్రేక్షకులు ఎవరు ఈ సినిమా కోసం అంతగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టుగా అనిపించడం లేదు. కారణం ఏంటి అంటే ఈ సినిమా రిలీజ్ చాలాసార్లు డిలే అవుతూ వస్తుంది. మొదట ఈ సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని ప్రణాళికలు రూపొందించారు. అయినప్పటికీ ఆది వీలు కాలేదు. ఇక ఆ తర్వాత జూన్ లో రిలీజ్ చేయడానికి ప్రణాళికను రచించారు. అది కూడా వర్కౌట్ కాకపోవడంతో ఎట్టకేలకు సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ అనౌన్స్ చేశారు. ఈ ఒక్క సినిమా కోసమే జూనియర్ ఎన్టీఆర్ దాదాపు మూడు సంవత్సరాల నుంచి తన డేట్స్ ని కేటాయిస్తూ వస్తున్నాడు.

మరి ఇలాంటి సమయంలో ఈ సినిమాని ఎలా తీర్చిదిద్దుతున్నారు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27 న రిలీజ్ అవుతుందంటే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిపోయి ఉండాలి. కానీ సినిమా షూట్ చాలా స్లోగా నడుస్తున్నందు వల్ల ఇంకా కొన్ని కీలకమైన సన్నివేశాలు తీయాల్సి ఉందట. మరి ఆ సీన్స్ ని ఎప్పుడు చిత్రీకరిస్తారు వాటికి గ్రాఫిక్స్ వర్క్ ఎప్పుడు పూర్తి చేస్తారు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకెప్పుడు కంప్లీట్ చేస్తారు అనే దాని మీదనే ఇప్పుడు చాలా ఆసక్తి అయితే నెలకొంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమాను అనుకున్న టైం కి తీసుకురావాలనే ప్రయత్నంలో ఎన్టీఆర్, కొరటాల శివ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈసారి కనక పోస్ట్ పోన్ అయితే మాత్రం ఈ సినిమా మీద ఇప్పటి దాక ఉన్న ఆ కాస్త బజ్ కూడా లేకుండా పోతుందనే ఉద్దేశ్యం తో ఎన్టీయార్ చాలా కేర్ ఫుల్ గా ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది…