https://oktelugu.com/

Nagarjuna-Naga Chaitanya : నాగార్జున, నాగ చైతన్య కాంబోలో వస్తున్న మరో మూవీ…వీళ్ళకి సోలోగా సక్సెస్ కొట్టే సత్తా లేదా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలామంది నటులు వాళ్ల కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక వాళ్ళందరూ తమ తమ రేంజ్ లో సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 28, 2024 / 10:19 AM IST

    Nagarjuna-Naga Chaitanya

    Follow us on

    Nagarjuna-Naga Chaitanya : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఈ ఫ్యామిలీలో మూడు తరాల నుంచి హీరోలు వస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ వరుస సక్సెస్ లను సాధిస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సక్సెస్ లను సాధించడానికి అక్కినేని ఫ్యామిలీ చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ప్రస్తుతం నాగార్జున వరుస సినిమాలను చేయడమే కాకుండా తన కొడుకుల సినిమాల్లో కూడా నటించి వాళ్లకు భారీ సక్సెస్ ని కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి చేసిన ‘మనం’ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఇక ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో పెద్దగా సక్సెస్ అయితే రావడం లేదు. ఇక నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇంక దాంతో మరోసారి వీళ్ళు కలిసి నటించబోతున్నారు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక బంగార్రాజు సినిమా దర్శకుడు అయిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా బంగర్రాజు కి సీక్వెల్ గా వస్తుందా? లేదంటే ఫ్రెష్ కథతో రాబోతుందా అనేది తెలియాల్సి ఉంది. మొదట ఈ దర్శకుడు నాగార్జునతో ‘సోగ్గాడే చిన్నినాయన’ అనే సినిమా చేశాడు. ఆ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో దానికి సీక్వేల్ గా బంగర్రాజు సినిమా చేశాడు.

    ఇక ఇప్పుడు మూడో పార్ట్ ని కూడా తెరకెక్కిస్తాడా అంటూ ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అక్కినేని ఫ్యామిలీ హీరోలు సోలోగా వస్తే సక్సెస్ కొట్టలేమనే ఉద్దేశ్యం తోనే ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కలిసి వస్తున్నారా అంటూ కొన్ని విమర్శలు అయితే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలు వరుస సక్సెస్ లను సాధిస్తుంటే అక్కినేని హీరోలు మాత్రం కొంతవరకు వెనకబడి పోతున్నారు.

    మరి వాళ్ళు కూడా సక్సెస్ బాట పట్టాలంటే మాత్రం మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేస్తే తప్ప వాళ్లకు సక్సెస్ అనేది రాదనే చెప్పాలి… ఇక నాగచైతన్య పరిస్థితి ఇలా ఉంటే అఖిల్ పరిస్థితి మరి దారుణంగా ఉంది. సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటి వరకు ఆయనకు సరైన సక్సెస్ అయితే లేదు.

    ఇక ప్రస్తుతం ఇప్పుడు మరొక భారీ ప్రాజెక్టు చేయబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి. ఇక భారీ అంచనాలతో గత సంవత్సరం వచ్చిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ ను మూటగట్టుకుంది. మరి ఇప్పుడు చేయబోయే సినిమాతో అయినా సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…