https://oktelugu.com/

Trivikram: ప్రేమైనా.. పగ అయినా.. పాపం విజయదేవరకొండ.. త్రివిక్రమ్ సంచలన వ్యాఖ్యలు…

ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది కామన్... కొంతమంది వరుస సక్సెస్ లను సాధిస్తే మరి కొంతమంది మాత్రం వరుసగా ఫెయిల్యూర్స్ ను అందుకుంటుంటారు. ఇక ఒకానొక సమయంలో వాళ్ళకంటూ ఒక మంచి సినిమా వచ్చినప్పుడు వాళ్ళు కూడా భారీ సక్సెస్ ని సాధిస్తూ ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసే స్థాయికి ఎదగవచ్చు. అందుకే ఇక్కడ ఎవరూ ఎవరిని తక్కువ అంచనా వేయాల్సిన పనిలేదు...

Written By:
  • Gopi
  • , Updated On : October 28, 2024 / 10:30 AM IST

    Trivikram

    Follow us on

    Trivikram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్… ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ‘గుంటూరు కారం’ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత అప్పటినుంచి ఇప్పటివరకు తన తదుపరి సినిమా ఏంటి అనే విషయం మీద సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తొందర్లోనే తన సినిమాకు సంబంధించిన అప్డేట్ ను ఇచ్చే విధంగా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. ఇక ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ రీసెంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ లక్కీ భాస్కర్ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. ఈ సినిమా ఈనెల 31వ తేదీన దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన నాగ వంశీ ఈ సినిమాని నిర్మించడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ నాగ వంశీ మధ్య మంచి బాండింగ్ అయితే ఉంది. కాబట్టి ఈ సినిమా యూనిట్ కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడానికి ఆయన ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు… ఇక ఈ ఈవెంట్ లో ఆయన లక్కీ భాస్కర్ సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమా భారీ సక్సెస్ సాధిస్తుంది అంటూ అందులో నటించిన నటీనటుల గురించి కూడా ఒక్కొక్కరి పేరు చెబుతూ మాట్లాడాడు. నిజానికి ఆయన అప్పటికే ఆ సినిమా చూసేసాను అని చెప్పాడు.

    ఒక్కో క్యారెక్టర్ తన మదిలో ఉండిపోయిందని అలాంటి గొప్ప క్యారెక్టర్ లను రాసిన వెంకీ అట్లూరి కి మంచి ఫ్యూచర్ ఉందని కూడా చెప్పాడు. ఇక దాంతో పాటుగా విజయ్ దేవరకొండ గురించి కూడా మాట్లాడుతూ నేను ఈ జనరేషన్ లో ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ కి మంచి ఫ్యాన్ ని… విజయ్ చాలా తక్కువ సమయంలోనే టాప్ లెవల్ ని చూశాడు…

    ఇక తన అభిమానుల చేత కీర్తింపబడ్డాడు వాళ్ల చేతే దుషింపబడ్డాడు. అయినప్పటికీ వీటన్నింటిని తట్టుకొని నిలబడ్డాడు కాబట్టి మనవాడు గట్టివాడు అంటూ ఆయన మీద ప్రశంశలను కురిపించాడు. ఇక మొత్తానికైతే విజయ్ దేవరకొండ ప్రస్తావన తీసుకొస్తూ ‘దేవరకొండ బాలగంగాధర్ తిలక్’ రాసిన ‘అమృతం కురిసిన రాత్రి’ పుస్తకంలో ఆయన రాసిన ‘మావాడు మహా గట్టివాడు’ అనే పదాన్ని ఉదాహరణగా తీసుకొని విజయ్ దేవరకొండ గురించి ప్రస్తావించాడు…ఇక ఇది చూసిన త్రివిక్రమ్ అభిమానులకి, విజయ్ దేవరకొండ అభిమానులకి చాలా ఆనందం అయితే కలిగింది.

    నిజానికి విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్లాపుల్లో ఉన్నాడు. అయినప్పటికీ ఆయన సితార ఎంటర్టైర్మెంట్స్ బ్యానర్ పైన గౌతమ్ తిన్ననూరు దర్శకత్వంలో తన 12వ సినిమాని చేస్తున్నాడు. అయితే ఈ సినిమా రెండు పార్ట్ లుగా రాబోతుంది అంటూ వార్తలైతే వస్తున్నాయి. ఇక దాదాపు ఈ సినిమా కోసం 100 కోట్ల బడ్జెట్ ని కూడా కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో తను మళ్లీ లైమ్ లైట్ లోకి వస్తానని చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు…