https://oktelugu.com/

Surya: పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ తో అదరగొట్టిన హీరో సూర్య..అల్లు ఫ్యామిలీ లేకపోతే నేను లేను అంటూ కామెంట్స్!

అభిమానుల కోసం 'కంగువ' చిత్రాన్ని ప్లాన్ చేసాడు డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. తమిళ ఆడియన్స్ ఈ సినిమాని తమిళ బాహుబలి, #RRR రేంజ్ లో భావిస్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 28, 2024 / 10:18 AM IST

    Surya

    Follow us on

    Surya: తమిళ హీరో సూర్య సుదీర్ఘ విరామం తర్వాత ‘కంగువ’ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ తో నవంబర్ 14వ తేదీన థియేటర్స్ లోకి రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. చాలా కాలం నుండి సరైన హిట్ కోసం ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈమధ్య వచ్చిన శివ కార్తికేయన్,ప్రదీప్ రంగనాథన్ వంటి కుర్ర హీరోలు కూడా సూర్య హైయెస్ట్ కలెక్షన్స్ ని దాటేస్తున్నారు. కానీ సూర్య తన బాక్స్ ఆఫీస్ స్టామినా కి తగ్గ సినిమాలు చేయడం లేదని అసంతృప్తి ఉండేది. ఎందుకంటే సూర్య కి తమిళనాడు రాష్ట్రంతో పాటు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ వంటి ప్రాంతాల్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉంది. గతంలో ఆయన చేసిన సినిమాలు అటువంటివి. ఆ స్టామినా తగ్గ సినిమా పడితే ఆకాశమే హద్దు అనే రేంజ్ లో వసూళ్లు వస్తాయి.

    అందుకే అభిమానుల కోసం ‘కంగువ’ చిత్రాన్ని ప్లాన్ చేసాడు డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. తమిళ ఆడియన్స్ ఈ సినిమాని తమిళ బాహుబలి, #RRR రేంజ్ లో భావిస్తున్నారు. మూవీ టీంతో పాటు హీరో సూర్య కూడా ఈ సినిమా ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా సూర్య తెలుగు ప్రొమోషన్స్ పై ప్రత్యేకమైన శ్రద్ద చూపిస్తున్నాడు. నిన్న ప్రొమోషన్స్ లో భాగంగా వైజాగ్ లో ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ కి మూవీ టీం తో పాటు సందీప్ కిషన్ కూడా హాజరయ్యాడు. సూర్య ఇంగ్లీష్ లో ఇచ్చే ప్రసంగాన్ని, సందీప్ కిషన్ తెలుగులోకి అనువదించి చెప్పాడు. అయితే మన టాలీవుడ్ హీరోలలో ఒక్కొక్కరి గురించి ఒక్కో మాట చెప్పాల్సిందిగా సూర్య ని కోరుతారు. పవన్ కళ్యాణ్ గురించి అడగగా ‘ఆన్ స్క్రీన్ లో ఆయన ఎలా హీరోగా ఉంటాడో. ఆఫ్ స్క్రీన్ లో కూడా అదే విధంగా ఉంటాడు, ముక్కుసూటి మనిషి’ అని అంటాడు సూర్య.

    అలాగే చివర్లో ఆయన పవన్ కళ్యాణ్ మ్యానరిజం కూడా చేస్తాడు. అలాగే అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ‘అల్లు అర్జున్, అల్లు అరవింద్ గార్ల వల్లే నేను ఈరోజు తెలుగులో ఈ స్థాయిలో ఉన్నాను. నా గజినీ చిత్రాన్ని అల్లు అరవింద్ గారే తెలుగులో విడుదల చేసాడు. అల్లు అర్జున్ డ్యాన్స్ కి నేను పెద్ద అభిమానిని, పుష్ప 2 కోసం మీ అందరి లాగానే నేను కూడా ఎదురు చూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు సూర్య. అలాగే చివర్లో ‘తగ్గేదేలే’ మ్యానరిజం కూడా చేసాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు, మెగా స్టార్ చిరంజీవి గురించి కూడా సూర్య మాట్లాడాడు. వాటిని ఈ క్రింది వీడియో లో మీరు చూడొచ్చు. త్వరలోనే ఆయన ‘అన్ స్టాపబుల్ 4’ ఎపిసోడ్ లో కనిపించబోతున్నాడు.