https://oktelugu.com/

Hero Nani: ‘హీరో నాని’ కుటుంబం నుంచి మరో హీరో.. ఎవరో తెలుసా ?

Hero Nani: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. ఎంతో కష్టపడి తనదైన నటనతో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో నేచురల్ స్టార్ నాని. ఇప్పటికే నాని ఎన్నో ఫీల్ గుడ్ సినిమాలు చేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం నాని హీరోగా కెరీర్ లో దూసుకుపోతున్నారు. నాని సినిమా థియేటర్లోకి వచ్చింది అంటే.. అందరి హీరోల అభిమానులు కడుపుబ్బ నవ్వుతూ ఎంజాయ్ చేయాల్సిందే. ఐతే, నాని తర్వాత ఆయన ఫ్యామిలీ నుంచి మరో హీరో […]

Written By:
  • Shiva
  • , Updated On : July 2, 2022 / 08:26 AM IST
    Follow us on

    Hero Nani: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. ఎంతో కష్టపడి తనదైన నటనతో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో నేచురల్ స్టార్ నాని. ఇప్పటికే నాని ఎన్నో ఫీల్ గుడ్ సినిమాలు చేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం నాని హీరోగా కెరీర్ లో దూసుకుపోతున్నారు. నాని సినిమా థియేటర్లోకి వచ్చింది అంటే.. అందరి హీరోల అభిమానులు కడుపుబ్బ నవ్వుతూ ఎంజాయ్ చేయాల్సిందే.

    Hero Nani family

    ఐతే, నాని తర్వాత ఆయన ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడు. నాని అన్నయ్య తనయుడు ‘వేద్’ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త పై త్వరలోనే క్లారిటీ రానుంది. నిజానికి ‘వేద్’ ను ఇండస్ట్రీలో హీరోగా పరిచయం చేయాలని చాలా రోజుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ సరైన టైమ్ దొరకలేదు.

    Also Read: Sammathame Collections: ‘సమ్మతమే’ 7 డేస్ కలెక్షన్స్.. ఇంకెన్ని కోట్లు రావాలంటే ?

    ముఖ్యంగా లాక్ డౌన్ టైమ్ వల్ల.. చాలా వరకూ వేస్ట్ అవ్వడంతో.. నాని అన్నయ్య ‘కొడుకు’ లేటుగా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. సుధీర్ వర్మ డైరెక్షర్ గా వేద్ హీరోగా క్రేజీ కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. నానికి సుధీర్ వర్మ ఒక కథ చెప్పాడు. కథ కూడా నానికి నచ్చింది. అయితే, నేను నీతో సినిమా చేయాలి అంటే.. నువ్వు మా అన్నయ్య కొడుకుతో (నానికి వరసకు అన్నయ్య) ఒక సినిమా చేయాలంటూ సుధీర్ వర్మకు నాని ఓ కండిషన్ పెట్టాడట.

    Hero Nani family

    అందుకే.. సుధీర్ వర్మ వేద్ తో సినిమాకి రెడీ అయ్యాడు. నాని కూడా తన అన్నయ్య కొడుకు పూర్తి బాధ్యతలను సుధీర్ వర్మకు అప్పగించాడని తెలుస్తోంది. మరి వేద్ తో సుధీర్ వర్మ హిట్ కొడతాడో లేదో చూడాలి. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన నాని, హీరో అయ్యాడు. అష్టా చెమ్మా మూవీతో వెండితెరకు పరిచయమయ్యాడు.

    అలా మొదలైన నాని కెరీర్ సక్సెస్ ఫుల్ హీరో స్థాయికి చేరింది. నాని గత చిత్రం శ్యామ్ సింగరాయ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పీరియాడిక్ అండ్ ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ ప్రేక్షకులను అలరించింది. ఇక నాని లేటెస్ట్ మూవీ అంటే సుందరానికి సినిమా ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం నానిది దసరా సినిమా నడుస్తోంది.

    Also Read:Chor Baazar 7 Days Collections: పూరి వారసుడికి సాలిడ్ ప్లాప్

    Tags