https://oktelugu.com/

Senior Heroine Malavika: ఫేడ్ అవుట్ హీరోయిన్ కి సడెన్ గా క్రేజ్.. కారణం ఆయనే !

Senior Heroine Malavika: సీనియర్ హీరోయిన్ మాళవిక ‘చాలా బాగుంది’ అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించింది. మళ్ళీ ఆమె తెలుగులో బిజీ అవ్వబోతుంది. మాళవిక చేతిలో ఇప్పుడు రెండు వెబ్ సిరీస్ లు వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో రెండు చిత్రాల్లో కూడా ఆమె కీలక పాత్రలు చేయబోతుంది. నిజానికి మాళవిక ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్. మరి ఆమెకి ఉన్నట్టుండి క్రేజ్ పెరగడానికి కారణమేంటో..! ఓ బడా నిర్మాత అండ […]

Written By:
  • Shiva
  • , Updated On : July 2, 2022 / 08:32 AM IST
    Follow us on

    Senior Heroine Malavika: సీనియర్ హీరోయిన్ మాళవిక ‘చాలా బాగుంది’ అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించింది. మళ్ళీ ఆమె తెలుగులో బిజీ అవ్వబోతుంది. మాళవిక చేతిలో ఇప్పుడు రెండు వెబ్ సిరీస్ లు వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో రెండు చిత్రాల్లో కూడా ఆమె కీలక పాత్రలు చేయబోతుంది. నిజానికి మాళవిక ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్.

    Senior Heroine Malavika

    మరి ఆమెకి ఉన్నట్టుండి క్రేజ్ పెరగడానికి కారణమేంటో..! ఓ బడా నిర్మాత అండ ఆమెకు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మాళవిక అయితే, మళ్లీ టాలీవుడ్ లో తన గ్లామర్ రుచిని చూపించబోతోంది. ప్రస్తుతం తాను చేస్తున్న సిరీస్ ల్లో ఏది విజయం సాదించినా.. స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ ఛాన్స్ లు కొట్టేయొచ్చు అని మాళవిక ఆశ పడుతుంది.

    Also Read: Hero Nani: ‘హీరో నాని’ కుటుంబం నుంచి మరో హీరో.. ఎవరో తెలుసా ?

    ఎలాగూ, చిరంజీవి, నాగార్జున, బాలయ్య లాంటి సీనియర్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తున్నారు. వాళ్ళ సినిమాల్లో కూడా సైడ్ క్యారెక్టర్స్ కోసం మాళవిక ఆల్ రెడీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా బాబీ దర్శకత్వంలో కూడా చిరు ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తోంది.

    అలాగే.. నాగ్ కొత్త సినిమాలోనూ మాళవిక ఓ కీలక పాత్రలో నటిస్తోంది. మరోపక్క మాళవికకి తమిళంలో కూడా క్రేజ్ ఉంది. అక్కడ వెబ్ సిరీస్ ల్లో అలాగే చిన్న చిత్రాల్లో కూడా ఆమె నటించాలని ప్లాన్ చేసుకుంటుంది. అసలు ప్రేక్షకులు పూర్తిగా మాళవికని మర్చిపోయారు. ఇలాంటి సమయంలో మాళవిక మళ్ళీ బిజీ కావడానికి చాలా కసరత్తులే చేస్తోంది.

    Senior Heroine Malavika

    మాళవిక దక్షిణ భారత చలనచిత్ర నటిగా.. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో కూడా ఆమె నటించి మెప్పించింది. పైగా ఒక్క హీరోయిన్‌ గానే కాకుండా.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గా, గ్లామర్‌ లేడీ విలన్‌ గా ఇలా పలు కోణాల్లో వెండితెరపై తన తళుకులు చూపించింది మాళవిక.

    ఐతే.. మాళవిక 2009 నుంచి సినిమాలకు దూరంగా ఉంది. 2022 నుంచి మళ్ళీ బిజీ అవుతుంది. ఇక ఈ ఫేడ్ అవుట్ హీరోయిన్ కి సడెన్ గా క్రేజ్ రావడానికి కారణం.. ఒక నిర్మాత అట. ఆయన పెద్ద డిస్ట్రిబ్యూటర్ కూడా. పైగా ఆయన స్టార్ హీరోలతో కలిసి మూవీ థియేటర్ల నిర్మాణంలో కూడా ఉన్నారు.

    Also Read:Varun Tej- Lavanya Tripathi: మెగా హీరోతో హీరోయిన్ పెళ్లి.. మ్యాటర్ మళ్లీ వైరల్ !

    Tags