
Rashmika Mandanna vs Samantha : ఈ మధ్య రష్మిక మందానకు ఏమంత కలిసి రాలేదు. ఆమె హిందీలో నటించిన గుడ్ బై, మిషన్ మజ్ను నెగిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. తలపతి విజయ్ కి జంటగా నటించిన భారీ చిత్రం వారసుడు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది . అలాగే ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్ర చేసిందన్న విమర్శలు ఎదుర్కొంది. ఆడవాళ్ళు మీకు జోహార్లు మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సీతారామం భారీ విజయం సాధించినా… క్రెడిట్ మొత్తం మృణాల్ ఠాకూర్ కొట్టేసింది. దీంతో రష్మిక రేసులో వెనుకబడ్డారని వార్తలు వచ్చాయి.
కానీ వరుస ప్రాజెక్ట్స్ ప్రకటిస్తూ ఆమె జోరు చూపిస్తున్నారు. రోజుల వ్యవధిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కి రష్మిక సైన్ చేశారు. భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములతో ఆమె ఒక చిత్రం చేస్తున్నారు. ఉగాది కానుకగా దీనిపై అధికారిక ప్రకటన జరిగింది. నీతి హీరోగా నటిస్తుండగా ఆయనతో రష్మికకు రెండో చిత్రం. వెంకీ కుడుములతో హ్యాట్రిక్ మూవీ. హిట్ కాంబో కావడంతో ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. రష్మికను ఛలో మూవీతో వెంకీ కుడుముల టాలీవుడ్ కి పరిచయం చేశారు.
తాజాగా పాన్ ఇండియా లేడీ ఓరియెంటెడ్ మూవీ ఆమె ప్రకటించారు. రైన్ బో టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. డ్రీమ్ వారియర్స్ బ్యానర్ లో దర్శకుడు శాంతరూబన్ తెరకెక్కిస్తున్నారు. నేడు పూజా కార్యక్రమాలతో రైన్ బో మూవీ మొదలైంది. ఏప్రిల్ 7 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. రైన్ బో ఫిక్షనల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతుందట. రష్మికకు జంటగా దేవ్ మోహన్ నటిస్తున్నారు.
అయితే ఈ చిత్రాన్ని గతంలో సమంతతో ప్రకటించారు. రెండేళ్ల అనంతరం రష్మికతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. దానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఇక సౌత్ లో సమంత మాత్రమే లేడీ ఓరియెంటెడ్ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. సమంత నటించిన యశోద పలు భాషల్లో విడుదల చేశారు. లేటెస్ట్ మూవీ శాకుంతలం సైతం ఐదు భాషల్లో ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నారు. ఆమెకు పోటీ ఇస్తూ రష్మిక రైన్ బో టైటిల్ తో పాన్ ఇండియా చిత్రం ప్రకటించారు. బాలీవుడ్ లో కూడా చిత్రాలు చేస్తున్న రష్మికకు అక్కడ కూడా ఫేమ్ ఉంది.
#Rainbow ..🌈
The different colours of life.This is extremely special to me.. 🥹
I hope I have all of your blessings and love.. ❤️❤️
And I really hope and pray that this becomes your next favourite characters of mine.. ❤️❤️😙🌻 https://t.co/2Om3ZSAxvv— Rashmika Mandanna (@iamRashmika) April 3, 2023