Anora Movie : గత ఏడాది హాలీవుడ్ లో సంచలన విజయం సాధించి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్న ‘అనోరా'(Anora Movie) చిత్రానికి ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్స్ లో ఎలాంటి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం ఒక్క ఆస్కార్ అవార్డు(Oscar Awards) వస్తేనే ఎంతో గర్వంగా, గౌరవం గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటిది ఒక సినిమాకి 5 ఆస్కార్ అవార్డ్స్ రావడం అనేది ఎంత గొప్ప విషయమో మీరే అర్థం చేసుకోండి. ఇందులో హీరోయిన్ గా నటించిన ‘మైకీ మ్యాడిసన్'(Mikey Madison) కి ఉత్తమ నటి క్యాటగిరీలో ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈమె అంతకు ముందు అత్యధిక హాలీవుడ్ చిత్రాలలో విలన్ రోల్స్ లోనే కనిపించేది. హీరోయిన్ గా కేవలం రెండు మూడు సినిమాల్లోనే నటించింది. ఆమె వయస్సు కేవలం పాతిక సంవత్సరాలు మాత్రమే. ఇంత చిన్న వయస్సులో ఆస్కార్ అవార్డు ని అందుకుందంటే ఆమె టాలెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
Also Read : IPL స్పెషల్ : ధోని, ప్రభాస్ వీడియో చూస్తే గూస్ బంప్స్!
అన్ని ఆస్కార్ అవార్డ్స్ ని సాధించేంతగా ఈ సినిమాలో ఏముందని మీరు కూడా అనుకుంటున్నారా?, అనుకోవడం ఎందుకు నేరుగా ఈ చిత్రాన్ని చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. జియో హాట్ స్టార్(Jio Hotstar) లో ఈ చిత్రం హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో భవిష్యత్తులో అందుబాటులోకి వస్తుందో లేదో చెప్పలేం. కానీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ మాత్రం అందుబాటులోనే ఉంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే రష్యా కి చెందిన ఒక కుర్రాడు పై చదువుల కోసం అమెరికా కి వెళ్తాడు. అతను ఒక కోటీశ్వరుడు. అమెరికా లో అతనికి ఒక వేశ్య పరిచయం అవుతుంది. తనతో వారం రోజులు ఉండాలని ఆమెకు డబ్బులిస్తాడు. ఆ వారం రోజులు ఆమెతో గడిపాక ఆమె ప్రేమలో పడిపోతాడు. ఇంటి పెద్దలకు చెప్పకుండా పెళ్లి కూడా చేసేసుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ కుర్రాడి తల్లిదండ్రులు అతన్ని తమతో పాటు తీసుకెళ్ళిపోతారు.
అతనితో పీకల్లోతు ప్రేమలో పడిపోయిన ఆ వేశ్య ఆ తర్వాత ఏమి చేసింది?, తన భర్తని దక్కించుకుందా లేదా అనేది ఆసక్తికరమైన అంశం. చాలా చక్కటి స్క్రీన్ ప్లే తో నడిపించారు. ఇంగ్లీష్ సినిమాల్లో ఎమోషనల్ సన్నివేశాలు ఉండడం చాలా అరుదు. కానీ ఈ చిత్రం లో ఫన్ తో పాటు ఎన్నో ఎమోషనల్ సన్నివేశాలు ఉంటాయి. మన ఇండియన్ సినిమాని చూసినట్టుగానే అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలను మనం మరచిపోలేము, ఆ సన్నివేశాలను మళ్ళీ మళ్ళీ చూడాలని కోరుకుంటాము, అంత అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటి వరకు ఎవరైనా చూడకంటే వెంటనే చూసేయండి.
Also Read : రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని..?