Anni Manchi Sakunamule Collections
Anni Manchi Sakunamule Collections: హాట్ సమ్మర్ లో కూల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా విడుదలైన నందిని రెడ్డి ‘అన్నీ మంచి శకునములే’ అనే చిత్రం యావరేజి టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. చిన్న చిన్న పోరాటపట్ల వల్ల ఫలితాలు తారుమారు అవుతాయి అనడానికి ఒక ఉదాహరణగా ఈ చిత్రాన్ని తీసుకోవచ్చు. ఇందులో కామెడీ సన్నివేశాలతో పాటుగా , ఫ్యామిలీ డ్రామా కూడా అద్భుతంగా పండించే ప్రయత్నం చేసింది నందిని రెడ్డి.
ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్ తో అలా సాగిపోగా, సెకండ్ హాఫ్ మాత్రం సినిమా గ్రాఫ్ తగ్గిపోతూ వచ్చింది.ఎడిటింగ్ లో తీసి వేయాల్సిన కొన్ని సన్నివేశాలను తీసేస్తే ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. 5 కోట్ల 50 లక్షల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రంగం లోకి దిగిన ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.
మొదటి రోజు నుండి ఇప్పటి వరకు ఈ చిత్రానికి 2 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. బ్రేక్ ఈవెన్ కి ఈ చిత్రం మరో మూడు కోట్ల రూపాయిల వరకు రాబట్టాల్సి ఉంది, కానీ అది అసాధ్యం అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే ఈ వీకెండ్ కి కూడా ఆడియన్స్ మొదటి ఛాయస్ ‘బిచ్చగాడు 2 ‘ చిత్రమే ఉంటుంది.
ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ రన్ ఆ రేంజ్ లో ఉంది మరి, ఇలాంటి సమయం లో ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం నెగ్గుకురావడం కష్టమే. కానీ ఫుల్ రన్ లో మూడు కోట్ల 50 లక్షల రూపాయిల వరకు రాబడుతుందని సమాచారం.అంటే కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అన్నమాట.పాపం సంతోష్ శోభన్ కి ఈమధ్య అన్నీ మంచి ప్రాజెక్ట్స్ పడుతున్నప్పటికీ కమర్షియల్ గా సక్సె రావడం లేదు, ఈ చిత్రం కూడా ఆ కోవలోకే చెందడం దురదృష్టకరం.