Anni Manchi Sakunamule Collection: ఈ సమ్మర్ లో విడుదలైన సినిమాలు ఒకటి రెండు మినహా మిగిలినవన్నీ ఒకదానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగలడం మనం చూస్తూనే ఉన్నాం. బయ్యర్స్ కి భారీ నష్టాలని మిగిలించిన ఏకైక సమ్మర్ సీజన్ ఇది. చిన్న సినిమాలైనా ఆదుకుంటాయిలే ఆశపడిన బయ్యర్స్ కి తీవ్ర నిరాశనే మిగిలింది. రీసెంట్ గా చిన్న సినిమాలలో టీజర్ మరియు ట్రైలర్ తో ‘పర్వాలేదు..ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడొచ్చు’ అనిపించినా చిత్రం ‘అన్నీ మంచి శకునములే’.
సంతోష్ శోభన్ మరియు మాళవిక నాయర్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాకి నందిని రెడ్డి దర్శకత్వం వహించింది. నందిని రెడ్డి సినిమా అంటేనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుంది అనే విషయం తెలిసిందే . ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ ఎంటెర్టైనెర్స్ కి నచ్చీ విధంగానే తీస్తూ మరో పక్క ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేసింది. కానీ మొదటి రోజు నుండే డివైడ్ టాక్ ని తెచ్చుకున్న ఈ చిత్రం మూడు రోజుల్లో ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
ఈ చిత్రం సంతోష్ శ్రీనివాస్ గత చిత్రాలతో పోలిస్తే మంచి ఓపెనింగ్ ని రాబట్టిందనే చెప్పాలి. నందిని రెడ్డి బ్రాండ్ మార్కెట్ లో అలాంటిది మరి, మొదటి రోజు ఈ చిత్రానికి సుమారుగా 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది సంతోష్ మార్కెట్ కి చాలా డీసెంట్ ఓపెనింగ్ అనే చెప్పాలి, టాక్ వచ్చి ఉంటే రెండవ రోజు నుండి ఈ సినిమా మొదటి రోజు కంటే డబుల్ వసూళ్లు రాబట్టేది, కానీ టాక్ రాకపోవడం తో కేవలం 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది.
అలా రెండు రోజులకు కలిపి కోటి 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, మూడు రోజులకు గాను కోటి 50 లక్షల షేర్ ని రాబట్టాలి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 5 కోట్ల రూపాయలకు జరిగింది. బ్రేక్ ఈవెన్ కి మరో మూడు కోట్ల 50 లక్షలు రాబట్టాలి, మరి ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది చూద్దాం.