https://oktelugu.com/

Aniruddhacharya Maharaj: బిగ్ బాస్ షోలోకి అనిరుద్ధాచార్య మహారాజ్.. దెబ్బకు సారీ చెప్పి లెంపలేసుకున్నాడు.. అసలేం జరిగిందంటే?

గత ఆదివారం బిగ్ బాస్ సీజన్ 18 గ్రాండ్ లాంచ్ కి అనిరుద్ధాచార్య ముఖ్య అతిథిగా విచ్చేసి హోస్ట్ సల్మాన్ ఖాన్ తో మరియు కంటెస్టెంట్స్ కాసేపు ముచ్చటించి ప్రేక్షకులను అలరించాడు. అయితే సీజన్ ప్రారంభానికి ముందు ఈయన ఒక కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నాడు అని ప్రచారం జరిగింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 11, 2024 / 03:27 PM IST

    Aniruddhacharya Maharaj

    Follow us on

    Aniruddhacharya Maharaj: గత మూడు రోజు రోజుల నుండి సోషల్ మీడియా లో అనిరుద్ధాచార్య గురించి ఏ స్థాయిలో ట్రోలింగ్ జరిగితిందో మనమంతా చూస్తూనే ఉన్నాము. ఒక ఆధ్యాత్మిక గురువుగా హితబోధలు చేసే స్థానం లో కూర్చున్న అనిరుద్ధాచార్య బిగ్ బాస్ లాంటి వివాదాస్పద రియాలిటీ షో లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతున్నారు అనడంతో నెటిజెన్స్ భగ్గుమన్నారు. ఇలాంటి పనులు చేసే సమాజానికి, హిందువులకి ఏ సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు అంటూ అనిరుద్ధాచార్య ని ట్విట్టర్ లో ట్యాగ్ చేసి ప్రశ్నించారు. సోషల్ మీడియా లో తనపై ఏర్పడిన ఈ నెగటివిటీ కి ఆయన స్పందిస్తూ తన అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. బిగ్ బాస్ 18 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ లో పాల్గొన్నందుకు క్షమాపణలు చెప్తున్నాను, సల్మాన్ ఖాన్ మరియు బిగ్ బాస్ టీం ప్రత్యేకంగా ఆహ్వానించడం వల్లనే నేను వెళ్లాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు.

    ఇది ఇలా ఉండగా గత ఆదివారం బిగ్ బాస్ సీజన్ 18 గ్రాండ్ లాంచ్ కి అనిరుద్ధాచార్య ముఖ్య అతిథిగా విచ్చేసి హోస్ట్ సల్మాన్ ఖాన్ తో మరియు కంటెస్టెంట్స్ కాసేపు ముచ్చటించి ప్రేక్షకులను అలరించాడు. అయితే సీజన్ ప్రారంభానికి ముందు ఈయన ఒక కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నాడు అని ప్రచారం జరిగింది. కానీ కేవలం గెస్ట్ గా మాత్రమే పాల్గొన్నాడు. గతం లో ఆయన అనేక సందర్భాలలో ఎంత డబ్బు ఆశ చూపిన బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోనని చెప్పుకొచ్చాడు. అయితే ప్రోమోలలో అనిరుద్ధాచార్య ఉండడాన్ని చూసిన ఆయన అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. డబ్బు ఆశకు చివరికి మీలాంటోళ్ళు కూడా ఇలా లొంగిపోతారని అనుకోలేదంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున విమర్శించారు. బిగ్ బాస్ షో ని గతంలో ఆయన ఆ రేంజ్ దుర్భాషలాడాడు. అయితే ఆయన కేవలం అతిథి గా మాత్రమే వెళ్ళాడు అని గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ చూసేవరకు ఎవరికీ తెలియదు. అయినప్పటికీ కూడా బిగ్ బాస్ రియాలిటీ షోని అంతలా ద్వేషించి, అతిథి గా అయినా వెళ్లేందుకు ఎలా మనసు వచ్చిందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేసారు. అందుకు అనిరుద్ధాచార్య క్షమాపణలు చెప్పుకొచ్చాడు.

    ఇకపోతే గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ లో ఈయన సల్మాన్ ఖాన్ తో జరిపిన సంభాషణ చాలా ఫన్నీ గా అనిపించింది. సోషల్ మీడియా లో ఈ వీడియో ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతుంది. సల్మాన్ ఖాన్ తో ఆయన మాట్లాడుతూ ‘మీ పెళ్లి కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నట్టు గానే, నేను కూడా ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు చేసుకుంటారు?’ అని అడగగా, దానికి సల్మాన్ ఖాన్ సమాధానం ఇస్తూ, అతి త్వరలోనే చేసుకుంటాను, నా పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి అని అంటాడు. హౌస్ లోపలకు వెళ్లిన కంటెస్టెంట్స్ తో కూడా ఆయన సరదాగా కాసేపు ముచ్చటిస్తాడు.