Animal OTT: ఓటీటీలోకి యానిమల్.. గట్టి షాకిచ్చారు.. అవాక్కైన ఫ్యాన్స్

విపరీతమైన నెగిటివిటీ మధ్య యానిమల్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. వైలెన్స్, న్యూడిటీ, ఫౌల్ లాంగ్వేజ్ తో యానిమల్ కూడి ఉంది. అలాగే పురుషాధిక్యతను ప్రోత్సహించేలా సన్నివేశాలు ఉన్నాయి అనేది ప్రధాన ఆరోపణ.

Written By: S Reddy, Updated On : January 26, 2024 1:21 pm
Follow us on

Animal OTT: 2023 సెన్సేషనల్ హిట్స్ లో యానిమల్ ఒకటి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామా రూ. 800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రన్బీర్ కపూర్ కెరీర్ హైయెస్ట్ నమోదు చేశాడు. కేవలం రూ. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా ఊహించని లాభాలు తెచ్చిపెట్టింది. యానిమల్ మూవీ నిజానికి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కొందరు అద్భుతం అంటే మరికొందరు చెత్త మూవీ అంటూ విమర్శలు చేశారు. సాంప్రదాయ వాదులు, సినీ, రాజకీయ ప్రముఖులు యానిమల్ చిత్రానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం జరిగింది.

విపరీతమైన నెగిటివిటీ మధ్య యానిమల్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. వైలెన్స్, న్యూడిటీ, ఫౌల్ లాంగ్వేజ్ తో యానిమల్ కూడి ఉంది. అలాగే పురుషాధిక్యతను ప్రోత్సహించేలా సన్నివేశాలు ఉన్నాయి అనేది ప్రధాన ఆరోపణ. విలన్ బాబీ డియోల్ ఇంట్రో సీన్ లో పెళ్లి వేడుకలో వధువును అందరి ముందు రేప్ చేస్తాడు. ఇలాంటి సన్నివేశాల మీద అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

కాగా ఓటీటీ వెర్షన్ లో మరికొన్ని సన్నివేశాలు జోడించి విడుదల చేస్తారనే ప్రచారం జరిగింది. యానిమల్ మూవీ చిత్ర నిడివి 3:21 నిమిషాలు. అదనంగా మరో 8 నిమిషాలు ఓటీటీ వెర్షన్ ఉంటుందని, ఎడిటింగ్ లో తీసేసిన సీన్స్ కలిపి విడుదల చేస్తారని సోషల్ మీడియా టాక్. అయితే ఫ్యాన్స్ ఊహించినట్లు అదనంగా సీన్స్ జోడించలేదు. థియేట్రికల్ వెర్షన్ కంటే మరో మూడు నిమిషాలు మాత్రమే అదనంగా ఓటీటీ వెర్షన్ ఉంది.

జనవరి 26 నుండి యానిమల్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో స్ట్రీమ్ అవుతుంది. థియేట్రికల్ వెర్షన్ కి ఓటీటీ వెర్షన్ కి పెద్దగా తేడా లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. వాళ్ళ ఆశలు గల్లంతు అయ్యాయి. అదనంగా సన్నివేశాలు జోడించాలి అంటే మరలా సెన్సార్ చేయాల్సి ఉంటుందని నిర్మాత ప్రవీణ్ రెడ్డి చెప్పారు. ఈ కారణంతోనే టీమ్ పెద్దగా మార్పులు చేయకుండా సినిమా విడుదల చేసి ఉండొచ్చు…