Pure EV Bike: రూపాయి పెట్రోల్ పోయకుండా నడిచే బైక్‌లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. పూర్తిగా ఎలక్ట్రిక్ బైక్‌ల యుగం రాబోతోంది. ఈ నేపథ్యంలో ఓ సంస్థ యూడా బ్యాటరీ బైక్‌లను తయారు చేసింది. దీని స్పెషాలిటీ ఏమిటంటే రివర్స్ కూడా వెళ్తుంది. దీనిని ప్యూర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వారు తయారు చేశారు. డిజైన్ విత్ మేడిన్ ఇండియా, మేక్ బై ప్యూర్, అనే బ్రాండ్‌తో ఈ బైక్‌ను లాంచ్ చేశారు. ఇది ఐఐటీహెచ్ రిలేటెడ్ కంపెనీ. ఇప్పటికే 80 వేల బైక్‌లు విక్రయించారు. అవి ఇప్పటి వరకు 135 కోట్ల కిలోమీటర్లు తిరిగాయి.
ఒక్కసారి చార్జింగ్‌తో 175 కిలోమీటర్లు..
ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను చార్జింగ్ పెడితే 175 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. దీని టాప్ స్పీడ్ 95 గంటకు కిలోమీటర్లు ఉంటుంది. ఇక కంపెనీవారుఈ బైక్‌కు వారంటీ కూడా ఇస్తుంది. 70 వేల కిలోమీటర్లు లేదా ఐదేళ్ల వారంటీ ఉంటుంది. ఇది ఏఐ బ్యాటరీ వెహికిల్ యూనిట్ ఓన్ మాన్యుఫ్యాక్చరింగ్.
ఫీచర్స్ ఇవీ..
ఈ బైక్‌కు రెండు డిస్కులు ఉంటాయి. ఎలక్ట్రిక్ బ్రేకింగ్ సిస్టం ఉంటుంది. బెస్ట్ ఫీచర్ ఏమిటంటే బ్లూటూట్ హెల్త్ మానిటరింగ్ సిస్టం కూడా ఉంటుంది. ఈ బ్యాటరీ వీళ్ల ఓన్ మాన్యుఫ్యాక్చరింగ్ కావడంతో డేటా మొత్తం సిస్టం నుంచి సేవ్ చేసుకుని క్లౌడ్‌లో స్టోర్ అవుతుంది. ఇక దీనికి రివర్స్ మోడ్ కూడా ఉంది. పార్కింగ్‌లో పెట్టినప్పుడు వెనక్కు తీయడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి రివర్స్ మోడ్ కూడా ఇచ్చారు.
చార్జింగ్ అయిపోయినా..
ఇక ఈ బైక్ ఎప్పుడైనా మర్గ మధ్యంలో చార్జింగ్ అయిపోయినా, పంక్చర్ అయినా తోసుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. మన నడుచుకుంటూ పట్టుకోగానే నెట్టకున్నా ముందుకు వెళ్తుంది. ఇక ఈ బైక్‌కు ఉన్న మరో ఫీచర్ కీ లేకుండా ఆన్ చేసుకోవచ్చు. స్మార్ట్ లాకింగ్ సిస్టం ఉంటుంది. దొంగలు ఎత్తుకెళ్లకుండా ఉంటుంది. ఎవరైనా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తే సౌండ్ కూడా వస్తుంది.