https://oktelugu.com/

Meta Tracking: ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ యూజర్లు ఎంత డేంజర్‌లో ఉన్నారో తెలుసా?

మీరు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు అయితే చాలు మీటు మెటా టెక్నాలజీస్‌ ట్రాక్‌లో పడినట్లే. ఎలా అంటే. మీరు రోజూ చేసూ యాప్స్, వెబ్‌సైట్స్, ఇతర ఆన్‌లైన్‌ సమాచారం మొత్తం మెటా ట్రాక్‌లో ఉంటుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 26, 2024 / 01:20 PM IST
    Follow us on

    Meta Tracking: ప్రస్తుతం నడుస్తున్నదంతా సోషల్‌ మీడియా కాలమే. అది లేకుండా రోజు గడవడం లేదు. రీల్స్, పోస్టులు, షేర్స్, లైక్స్‌.. ఇలా ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఆన్‌డ్రాయిడ్‌ ఫోన్‌ ఉన్నవారంతా ఖాళీ సమయాల్లో సోషల్‌ మీడియాతో కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఈ సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ యూజ్‌ చేసేవారు ఎక్కువ. కానీ, ఈ రెండు యూజ్‌ చేస్తున్నవారు ఎంత డేంజర్‌లో ఉన్నారంటే.. ఈ సోషల్‌ యాప్‌లను నిర్వహిస్తున్న మెటా సంస్థ మీ పర్సనల్‌ డేటాను ట్రాప్‌ చేస్తుంది. ఈవిషయం చాలా మందికి తెలియదు. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.

    మెటా ట్రాకింగ్‌ ఇలా..
    మీరు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు అయితే చాలు మీటు మెటా టెక్నాలజీస్‌ ట్రాక్‌లో పడినట్లే. ఎలా అంటే. మీరు రోజూ చేసూ యాప్స్, వెబ్‌సైట్స్, ఇతర ఆన్‌లైన్‌ సమాచారం మొత్తం మెటా ట్రాక్‌లో ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ సమాచారం వేరేవారికి వెళ్తే చాలా డేంజర్‌. ఈ వివరాలు ఏమీ తెలుసుకోకుండా సోషల్‌ మీడియాను చాలా మంది ఎంజాయ్‌ చేస్తున్నారు.

    చెక్‌పెట్టడం ఎలా..
    మెటా ట్రాక్‌ నుంచి బయటపడాలంటే ఈ టిప్స్‌ ఫాలో అవండి. వెంటనే మీరు మెటా ట్రాక్‌ నుంచి బయటపడొచ్చు. వెంటనే చేయకుంటే డేంజర్‌లో పడ్డట్లే. ట్రాక్‌ నుంచి తప్పించుకోవాలంటే వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌లోకి వెళ్లి.. అక్కడ సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయాలి. అక్కడి నుంచి అకౌంట సెంటర్‌లోకి వెళ్లాలి. అక్కడ మనకు యువర్‌ ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ పర్మిషన్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిమీద క్లిక్‌ చేయగానే అందులో యువర్‌ యాక్టివిటీ ఆఫ్‌ మెటా టెక్నాలజీస్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిని క్లిక్‌ చేయగానే మనం రీసెంట్‌గా ఫోన్‌లో వాడిన డేటా మొత్తం కనిపిస్తుంది. వెంటనే ఏం చేయాలంటే కిందకు వెళ్లి డిస్‌కనెక్‌ యాక్టివీటి క్లిక్‌ చేయాలి. తర్వాత అన్నీ చూస్‌ చేసుకుని కంటిన్యూ అని క్లిక్‌ చేయాలి. వెంటనే కన్‌ఫామ్‌ అడుగుతుంది. ఒకే అనగానే అన్నీ ఎరేజ్‌ అయిపోతాయి. మరోసారి ట్రాక్‌ చేసే అవకాశం కూడా ఉండదు.