Animal Collection: వసూళ్ల సునామి ని సృష్టిస్తున్న అనిమల్…ఆ ఒక్క దేశం లోనే 100 కోట్లు రాబట్టిందా..?

బాలీవుడ్ లో ఇప్పటికే టాప్ 10 హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల్లో ఒకటిగా నిలువగా ఇక ప్రపంచం మొత్తంలో మంచి వస్తువులను రాబట్టిన ఇండియన్ సినిమాగా గుర్తింపు పొందుతుంది..

Written By: Gopi, Updated On : December 13, 2023 12:18 pm

Animal Collection

Follow us on

Animal Collection: సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అనిమల్ సినిమా రికార్డుల సునామీని సృష్టిస్తుంది. ఇక ఇప్పటికే 12 రోజుల్లో 700 కోట్లు దాటి 800 కోట్ల కలెక్షన్స్ వైపు పరుగులు పెడుతున్న ఈ సినిమా రణ్బీర్ కపూర్ కెరియర్ లో బిగ్గెస్ట్ కలక్షన్స్ వసూళ్లను రాబట్టిన సినిమాగా చరిత్రలో నిలుస్తుంది. ఈ సినిమా లాంగ్ రన్ లో వెయ్యి కోట్ల వరకు వసూళ్లను రాబడుతుంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద పలువురు ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి సందీప్ రెడ్డి వంగ ఇంతకుముందు తీసిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ లాంటి సినిమాలు ఒక మోస్తర హిట్టు తో ఆగిపోగా అనిమల్ మాత్రం ప్రపంచ రికార్డులు మొత్తం క్రియేట్ చేస్తుంది.

బాలీవుడ్ లో ఇప్పటికే టాప్ 10 హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల్లో ఒకటిగా నిలువగా ఇక ప్రపంచం మొత్తంలో మంచి వస్తువులను రాబట్టిన ఇండియన్ సినిమాగా గుర్తింపు పొందుతుంది…ఇక ఈ సినిమా అమెరికా,కెనడా 2 దేశాల్లో 13 మిలియన్ డాలర్లు వసూలు చేసి కొత్త హిస్టరీ ని క్రియేట్ చేస్తుంది మన ఇండియన్ రుపీస్ లో అయితే 108 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఆస్ట్రేలియాలో 3.5 మిలియన్ ఆస్ట్రేలియన్ పౌండ్స్ వసూలు చేయగా, బ్రిటన్‌లో 2.5 మిలియన్ పౌండ్స్ వసూళ్లను సాధించింది. దాంతో రికార్డు స్థాయి కలెక్షన్లు నమోదు చేస్తు ముందుకు దూసుకెళ్తుంది…

ఇక ఈ సినిమాతో మరోసారి సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా లెవెల్ లో తన స్టామినాను భారీ ఎత్తున చూపించాడు. చేసినవి మూడు సినిమాలే అయినప్పటికీ పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో ఈయన స్పిరిట్ అనే సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాతో పాన్ వరల్డ్ లోనే భారీ రికార్డులు కొట్టడానికి సిద్ధమవుతున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ తో సినిమా చేయడానికి బాలీవుడ్ హీరోలు మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి నెక్స్ట్ ప్రభాస్ సినిమాతో ఏ రేంజ్ లో తన ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాడో…ఇక ఇది ఇలా ఉంటే సందీప్ మాత్రం ఇక ముందు వచ్చే సినిమాలు కూడా చాలా వైల్డ్ గా ఉంటాయి అని చెప్తున్నాడు…