https://oktelugu.com/

Maruti Cars: మార్కెట్‌ను కొల్లగొట్టిన మారుతి.. రికార్డు స్థాయిలో ఆ కార్ల అమ్మకాలు..

ప్రముఖ ఆటోమొబైల్‌ తయారీ కంపెనీ మారుతీ సుజుకీ బ్రెజ్జాను 2016 మార్కెట్‌లోకి విడుదల చేసింది. 2023, నవంబర్‌ నాటికి 10 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును చేరుకుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 29, 2023 2:08 pm
    Maruti Cars

    Maruti Cars

    Follow us on

    Maruti Cars: భారతీయ దిగ్గజ ఆటోమొబైస్‌ సంస్థ మారుతి.. కార్ల మార్కెట్‌ను షేక్‌ చేసింది. ఈ ఏడాది ఏ కంపెనీకి సాధ్యంకాని రికార్డును సొంతం చేసుకుంది. తన బ్రీజా ఎస్‌యూవీ కార్ల అమ్మకాలు 10 లక్షలకు చేరువయ్యాయి. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

    2016లో లాంచ్‌..
    ప్రముఖ ఆటోమొబైల్‌ తయారీ కంపెనీ మారుతీ సుజుకీ బ్రెజ్జాను 2016 మార్కెట్‌లోకి విడుదల చేసింది. 2023, నవంబర్‌ నాటికి 10 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును చేరుకుంది. ఈ ఏడాది నవంబర్‌ వరకు 9,96,608 కార్లను విక్రయించినట్లు సంస్థ ప్రకటించింది. 10 లక్షల యూనిట్ల అమ్మకాలకు కేవలం 3,392 యూనిట్లు మాత్రమే తక్కువ. ఈ సంఖ్య డిసెంబర్‌ 2023 మొదటి వారం నాటికి పూర్తయి ఉంటందని సంస్థ
    భావిస్తోంది.

    ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యం 10.67 లక్షలు..
    ఇదిలా ఉండగా ప్రజల నుంచి ఆదరణ పొందుతున్న బ్రిజా కారును ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 10.67 లక్షలు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేరక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ యూనిట్లు అమ్ముడైన రికార్డు సొంతం చేసుకోవాలని చూస్తోంది.

    టాటాతో పోటీ..
    ఇక మారుతి బ్రిజా కారుకు భారతీయ మార్కెట్లో టాటా నెక్సాన్‌తో పోటీ ఉంది. ఈ కారు కూడా 2016లోనే మార్కెట్‌లోకి వచ్చింది. అమ్మకాల పరంగా బ్రిజా నెక్సాన్‌ కన్నా వెనుకబడింది. 2022, 2023 ఆర్థిక సంవత్సరాల్లో టాటా నెక్సన్‌ ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఆ తరువాత, మారుతి బ్రెజ్జా ఎస్‌యూవీ అమ్మకాలను పెంచడంలో సహాయపడింది. మార్కెట్‌ వర్గాల రిపోర్టు ప్రకారం.. 2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో 1.10 లక్షల యూనిట్ల బ్రిజా కారును విక్రియింది. ఇది నెక్సన్‌ కన్నా 593 యూనిట్లు ఎక్కువ.