Anil Ravipudi: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ ప్రత్యేకమైన ఐడెంటిటి అయితే క్రియేట్ అవుతుంది. ఇక కొంతమంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిమితమవుతుంటే మరి కొంతమంది మాత్రం పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నారు…
Also Read: అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో ఎక్కువ భాగం అండర్ వాటర్ లోనే ఉంటుందా..?
కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో అనిల్ రావిపూడి (Anil Ravipudi)ఒకరు… ఈయన చేసిన సినిమాలు రొటీన్ కథలతో వచ్చినప్పటికి అందులోనే ట్రీట్ మెంట్ చాలా కొత్తగా ఉండటం వల్ల ప్రేక్షకులకు ఆయన సినిమాలు ఎక్కువగా నచ్చుతూ ఉంటాయి. ఇక ఎమోషన్స్ ని, ఎలివేషన్స్ బ్యాలెన్స్ చేస్తూ ఆయన సినిమాని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఈయన సినిమాలో కామెడీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కామెడీ ప్రధానంగా సినిమాలను చేసి సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించిన దర్శకులలో తను మొదటి స్థానం లో ఉంటాడు. మరి ఈ జనరేషన్ లో కామెడీని ముందుకు తీసుకెళ్లే దర్శకుడు కూడా ఈయనే కావడం విశేషం… అయితే అనిల్ రావిపూడి ఒక సినిమా పూర్తయ్యలోపే మరో సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొత్తాన్ని చేసి పెడుతూ ఉంటాడు. దానికి కారణం ఆయన ఒక్కడే కాదు తనకు రైటింగ్ టీం ఉంది. అందువల్లే వాళ్ళ సహాయాన్ని తీసుకొని ఒక సినిమా సెట్స్ మీద షూట్ నడుస్తున్న సందర్భంలో వాళ్ల చేత ఇంకో సినిమా స్క్రిప్ట్ ని రాయించే పని పెడతారట. అందుకోసమే ఆయన దగ్గర కొంతమంది పర్మినెంట్ రైటర్లు ఉంటారు. ముఖ్యంగా అందులో సాయి కృష్ణ, ఆది నారాయణ లాంటి రైటర్లు అతనికి రైటింగ్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన మొత్తం పనులను వీళ్ళే చూసుకుంటారు. ఇక అనిల్ రావిపూడి డైలాగులను రాసుకున్నప్పటికి అతనికి డైలాగుల్లో సహాయం చేయడానికి మరొక ఇద్దరు రైటర్లు ఉంటారు. అజ్జు మహాకాళి, తిరుమల నాగ్ అనే ఇద్దరు రైటర్స్ ఉంటారు. వీళ్ళు అతనికి డైలాగ్స్ రాయడంలో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక ఈ నలుగురు రైటింగ్ టీం తో ఆయన ముందుకు సాగుతూ ఉంటాడు.
అయితే అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఇప్పుడు ఒక స్క్రిప్ట్ ని ఫైనల్ చేసి షూట్ కి వెళ్లిన తర్వాత అనిల్ ఇచ్చే ఒక లైన్ ని ఆసరాగా చేసుకొని వీళ్ళు కథని అల్లుతు ఉంటారు. అనిల్ ఐడియాలజీకి తగ్గట్టుగా ఆ కథలను చేసిన తర్వాత అనిల్ దానికి ఫైనల్ గా తన వర్షాన్ని ఆడ్ చేస్తూ కొన్ని సీన్స్ రాసుకుంటాడు.
అందువల్లే సినిమా స్క్రిప్ట్ అనేది ఈజీగా తొందరగా అయిపోతుంది. అందువల్ల ఆయన ఎక్కువ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో కమర్షియల్ సినిమాలను చేస్తూ ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా అసలు ప్లాప్ అనేది లేకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరో తనే కావడం విశేషం…
అయితే తన రైటింగ్ టీం కోసం ఆయన భారీగా ఖర్చు చేస్తూ ఉంటారట. వాళ్ళ ఒక్కొక్కరికి దాదాపు లక్షల్లో సాలరీలను ఇస్తూ మెయింటైన్ చేస్తూ ఉంటాడు…ప్రస్తుతం ఆయన చిరంజీవితో సినిమా చేస్తున్నాడు…ఇక ఈ సినిమాకి కూడా ఇదే రైటింగ్ టీమ్ కొనసాగుతూ ఉండడం విశేషం…