Nani: సినిమా ఇండస్ట్రీలో ఏ రోజు ఎవరు టాప్ పొజిషన్ లో ఉంటారు అనేది ఎవ్వరు చెప్పలేరు. ఎందుకంటే ఇది ఒక జూదం లాంటిది. ఎప్పుడు ఎవరికీ సక్సెస్ లను సాధిస్తే వాళ్లు మాత్రమే టాప్ లో ఉంటారు. మిగతా వాళ్ళంతా అదా పాతాళానికి పడిపోతూ ఉంటారు. అందుకే ఎవరికి వారు సూపర్ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు…
Also Read: పాక్ పై ఎంఎస్ ధోని యుద్ధం చేశాడా? వైరల్ పిక్స్
యంగ్ హీరోల్లో ఎవరికి సాధ్యం కానీ రీతిలో వరస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నటుడు నాని (Nani)…ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నవే కావడం విశేషం…ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని ఎంచుకొని సినిమాలు గా చేస్తూ మంచి సక్సెస్ లను సాధిస్తూ ఉంటాడు. అందుకే ఆయనకు ఇతర హీరోలతో పోలిస్తే సక్సెస్ రేట్ చాలా ఎక్కువనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టిన నాని ఇప్పుడు స్టార్ హీరోగా మారడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక తను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు వందల్లో రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. కానీ ఇప్పుడు కోట్లల్లో తీసుకుంటున్నాడు. ఇక హిట్ 3 సినిమా కోసం 20 కోట్ల రెమ్యూనరేషన్ ను తీసుకున్న ఆయన తర్వాత సినిమా కోసం 40 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా హిట్ 3 సినిమా సక్సెస్ అవ్వడంతో నానికి ఒక మంచి బూస్టప్ అయితే వచ్చింది. అలాగే సినిమా మీద తన పూర్తి ఫోకస్ పెట్టుకోవడానికి అవకాశం దొరికింది. ఇప్పుడు చేయబోతున్న సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించినట్టయితే ఆయన టైర్ వన్ హీరోగా మారడమే కాకుండా భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇక ప్రస్తుతానికైతే 40 కోట్లు తీసుకుంటున్న నాని ఇకమీదట రాబోయే సినిమాలతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి క్రేజ్ క్రియేట్ చేసుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది… ఇక శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో వస్తున్న ప్యారడైజ్ (Paradaise) సినిమా షూటింగ్లో తను పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈ సినిమా మీదనే ఆయన పూర్తి ఫోకస్ పెట్టారట.ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ వస్తున్న నాని ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది…చూడాలి మరి నాని రాబోయే రోజుల్లో ఎలాంటి సక్సెస్ లను అందుకుంటాడు అనేది…