Allu Arjun And Atlee: ప్రస్తుతం పాన్ ఇండియా లో తెలుగు సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతోంది. మన హీరోలు చేసిన సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా బాలీవుడ్ లో ఉన్న హీరోలకు సైతం షాకిస్తూ వాళ్ళ మార్కెట్ ని వాళ్ళు కోల్పోయేలా చేస్తున్నాయి…ఇక ప్రభాస్ బాహుబలి సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తే ఆ తర్వాత అల్లు అర్జున్ పుష్ప, పుష్ప 2 సినిమాలతో భారీ స్టార్ డమ్ ను సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీ రికార్డులను సైతం బ్రేక్ చేశాడు…
Also Read: పాక్ పై ఎంఎస్ ధోని యుద్ధం చేశాడా? వైరల్ పిక్స్
‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో పాన్ ఇండియాలో భారీ విజయాన్ని సాధించిన నటుడు అల్లు అర్జున్ (Allu Arjun)… ఈ సినిమా ఆయనను ఓవర్ నెట్లో పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది. నిజానికి పుష్ప సినిమాకి ముందు తెలుగుకు మాత్రమే పరిమితమైన ఆయన పుష్ప మొదటి పార్ట్ తో బాలీవుడ్ లో భారీ సక్సెస్ ని అందుకున్నాడు. ఈ సినిమాతో ఇండియాలో 1850 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి బాహుబలి రికార్డ్స్ అయితే బ్రేక్ చేశారనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాడు. అందువల్లే ఈ సినిమా మీద ఎక్కువ హైప్ అయితే క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాకు తగ్గ ప్రమోషన్స్ అయితే చేసి సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. తద్వారా అదే హైప్ తో వచ్చిన పుష్ప 2 సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.
దానికి తగ్గట్టుగానే భారీ వసూళ్లను కూడా రాబట్టింది. ఇక తన సక్సెస్ లను కంటిన్యూ చేయాలని ఉద్దేశంతో ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా డైరెక్టర్ అయిన అట్లీ (Atlee)తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా హైలీ గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమాగా రాబోతుందట. ఇందులో చాలా భాగం అండర్ వాటర్ లోనే జరగబోతుందట.
ముఖ్యంగా కొన్ని కీలకమైన ఎపిసోడ్లు మాత్రం అండర్ వాటర్లోనే చిత్రీకరించాలని దర్శకుడు అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి అండర్ వాటర్ లో షూట్ చేయడం వల్ల సినిమా ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుందా? లేదా అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికి ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని అండర్ వాటర్ లో సీన్స్ అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకుడికి ఏ మాత్రం బోర్ కొట్టించకుండా చిత్రీకరించబోతున్నారట…
ఇక ఏది ఏమైనా కూడా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరో గా మారిపోతాడు. ఇప్పటికే ఆయన కోసం నార్త్ లో విపరీతమైన అభిమాన సంఘాలు కూడా వెలిశాయి. ఆయన అంటే చచ్చిపోయే అభిమానులు తయారయ్యారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…