Anil Ravipudi and Chiranjeevi : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెబితే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అందరికీ గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఆయన గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ(Telugu Film Industry) కి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నాడు. తద్వారా ఆయన చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ లుగా నిలవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఆయనతో సినిమా చేయడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి దర్శకుడు ఆసక్తి చూపిస్తూ ఉంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తున్న దర్శకులందరూ కూడా ఆయనను చాలా కొత్తగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే విశ్వంభర(Vishvam bhara) సినిమాతో వశిష్ట చిరంజీవిని చాలా డిఫరెంట్ గా చూపించే ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక దీంతో పాటుగా ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది.
ఇక చిరంజీవితో చేయబోయే సినిమాని మార్చి నెలలో స్టార్ట్ చేసి 2026 సంక్రాంతి బరిలో నిలపాలనే ఉద్దేశ్యంతో అనిల్ రావిపూడి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధిస్తానని తన ఖాతాలో తొమ్మిదొవ హిట్ పడటం పక్క అంటూ అనిల్ రావిపూడి చెబుతుండటం విశేషం.
మరి చిరంజీవిని చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తానని చెబుతున్న అనిల్ రావిపూడి చిరంజీవితో ఎలాంటి సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కూడా తన గత సినిమాల మాదిరిగానే రొటీన్ ఫార్ములా లో ఉంటుందా? లేదంటే కొత్తగా ఏదైనా ప్రజెంట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటివరకు అనిల్ రావిపూడి చేసిన 8 సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలవడంతో ఆయన చేయబోతున్న సినిమాలు మీద ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలైతే పెరిగాయి.
కాబట్టి ప్రతి ప్రేక్షకుడు ఆయన సినిమాని చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…మరి చిరంజీవి లాంటి స్టార్ హీరో ఇమేజ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఆయన ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే అనిల్ రాసిన కథను ఫైనల్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరంజీవి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఎలా కనిపించబోతున్నాడనేది తెలియాల్సి ఉంది…