Homeఎంటర్టైన్మెంట్Anil Ravipudi And Venkatesh: రెమ్యూనరేషన్ విషయంలో కొట్లాట..వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ నుండి ఆ...

Anil Ravipudi And Venkatesh: రెమ్యూనరేషన్ విషయంలో కొట్లాట..వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ నుండి ఆ యంగ్ హీరో అవుట్!

Anil Ravipudi And Venkatesh: ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత అనిల్ రావిపూడి(Anil Ravipudi) మీద ఆడియన్స్ లో అంచనాలు ఎవ్వరూ ఊహించనంత రేంజ్ కి వెళ్ళిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే మన టాలీవుడ్ కి దొరికిన మరో రాజమౌళి లాంటి డైరెక్టర్ అనుకోవచ్చు. కథ రాయడానికి నెల రోజులకు మించి ఎక్కువ సమయం తీసుకోడు. సినిమాని పూర్తి చేయడానికి రెండు నెలలకు మించి సమయం తీసుకోడు. అలా వస్తాడు, భారీ హిట్ కొట్టి వెళ్ళిపోతాడు. ఈ హిట్టు లేక ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ కనుమరుగు అయిపోయారు. అనిల్ రావిపూడి కాబట్టి ఎదో ఒక మ్యాజిక్ చేసి బ్లాక్ బస్టర్ కొడుతూ ముందుకు పోతూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన తన తదుపరి చిత్రాన్ని విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) తో చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం లో మరో హీరో కూడా నటించేందుకు స్కోప్ ఉండడంతో, మలయాళం స్టార్ హీరోల్లో ఒకరైన ఫహాద్ ఫాజిల్ ని ఎంచుకున్నారు. రీసెంట్ గానే ఆయనతో మీటింగ్ కూడా జరిగింది. ఇక రెమ్యూనరేషన్ గురించి మాత్రమే చర్చ చెయ్యాలి. నిన్న అది కూడా జరిగింది. కానీ చర్చలు విఫలం అయ్యాయి. ఎందుకంటే ఫహాద్ ఫాజిల్ ఏకంగా పది కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేశాడట. దీంతో మేకర్స్ ఆయన్ని ఈ చిత్రం లో తీసుకోవాలి అనే ఆలోచనని విరమించుకున్నారు. ఇప్పుడు తమిళ హీరో కార్తీ తో చర్చలు జరుపుతున్నారు. దాదాపుగా ఖరారు అయ్యేటట్టుగానే అనిపిస్తుందని అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ ఈ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయితే మాత్రం, ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ లాగానే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరు కూడా సహజ నటులు, ఇద్దరికీ మంచి కామెడీ టైమింగ్ ఉంది, సెంటిమెంట్ కూడా అద్భుతంగా పండిస్తారు. బాక్స్ ఆఫీస్ వద్ద మరో ఇండస్ట్రీ హిట్ ని లాక్ చేసేసుకోవచ్చు.

అనిల్ రావిపూడి వెంకటేష్ తో చేయబోతున్న 5వ చిత్రమిది. F2,F3,సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్(స్పెషల్ రోల్) చిత్రాల్లో విక్టరీ వెంకటేష్ ని వివిధ కోణాల్లో చూపించి ఆడియన్స్ చేత కడుపుబ్బా నవ్వించేలా చేసిన అనిల్ రావిపూడి, ఈసారి ఎలాంటి పాత్రలో చూపించబోతున్నాడు అనేది సస్పెన్స్. ఈ ఏడాది ఆగస్టు చివరి వారం నుండి ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టి, ఎట్టిపరిస్థితిలోనూ సంక్రాంతికి తీసుకొచ్చేలా ప్లానింగ్ చేస్తున్నారు మేకర్స్. మరి ఇది ఎంత వరకు సాధ్యపడుతుందో చూడాలి. ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ‘ఆదర్శ కుటుంబం’ అనే చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular