Homeఎంటర్టైన్మెంట్Dil Raju Comments On Heroes: మా నిర్మాతలకు హీరోలు విలువ ఇవ్వడం లేదంటూ దిల్...

Dil Raju Comments On Heroes: మా నిర్మాతలకు హీరోలు విలువ ఇవ్వడం లేదంటూ దిల్ రాజు హాట్ కామెంట్స్..వీడియో వైరల్!

Dil Raju Comments On Heroes: నైజాం ప్రాంతం లో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ని మొదలుపెట్టి, ఆ తర్వాత నిర్మాతగా మారి ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న నిర్మాత దిల్ రాజు(Dil Raju). నేటి తరం సూపర్ స్టార్స్ అందరితో కలిసి ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశాడు. కేవలం నిన్నటి తరం హీరోలు మాత్రమే మిగిలారు. కేవలం వెంకటేష్ […]

Dil Raju Comments On Heroes: నైజాం ప్రాంతం లో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ని మొదలుపెట్టి, ఆ తర్వాత నిర్మాతగా మారి ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న నిర్మాత దిల్ రాజు(Dil Raju). నేటి తరం సూపర్ స్టార్స్ అందరితో కలిసి ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశాడు. కేవలం నిన్నటి తరం హీరోలు మాత్రమే మిగిలారు. కేవలం వెంకటేష్ తో మాత్రమే ఆయన మూడు సినిమాలు చేశాడు. చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున లతో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. ఇంతమంది తో పని చేసిన అనుభవం ఉన్న దిల్ రాజు, నేటి తరం లో నిర్మాత అంటే విలువ లేకుండా పోయింది అంటూ మాట్లాడడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అంటే ఆయనకు విలువ ఇవ్వని ఆ హీరో ఎవరు అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

ఆయన మాట్లాడుతూ ‘నిర్మాత అంటే ఈరోజుల్లో విలువ లేదు. ప్రస్తుత జనరేషన్ లో నిర్మాతలు అంటే నిర్మాతలే. కానీ ఆరోజుల్లో నిర్మాత అంటే అట్లూరి పూర్ణ చంద్ర గారు లాంటి నిర్మాతలు ఇచ్చే వాళ్ళు , మిగతా వాళ్లంతా తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, తీసుకునే వాళ్ళే ఇచ్చే వాళ్ళని శాసిస్తున్నారు’ అంటూ దిల్ రాజు మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దిల్ రాజు చివరి సారిగా పని చేసిన స్టార్ హీరో రామ్ చరణ్. ఆయన తో చేసిన ‘గేమ్ చేంజర్’ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. అప్పటి నుండి దిల్ రాజు ఇలా అన్నీ ఓపెన్ గా మాట్లాడడం మొదలు పెట్టాడు.

ఆయన తమ్ముడు శిరీష్ కూడా ఇలాగే ఒక ఇంటర్వ్యూ లో ఓపెన్ గా మాట్లాడి తీవ్రమైన ట్రోల్స్ ని ఎదురుకున్నాడు. సినిమా ఫ్లాప్ అయితే రామ్ చరణ్ మాకు ఫోన్ చేసి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆయన మాట్లాడిన మాటలు పెద్ద దుమారమే రేపింది. మళ్లీ ఆయన ప్రత్యేకంగా క్షమాపణలు కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు దిల్ రాజు కి కూడా అలాంటి పరిస్థితి రానుందా?. ప్రస్తుతం ఆయనకు పవన్ కళ్యాణ్ డేట్స్ తప్ప, మరో స్టార్ హీరో డేట్స్ లేవు. దిల్ రాజు ని మిగిలిన స్టార్ హీరోలు అసలు పట్టించుకోవడం లేదు. ఆ నిరాశతోనే ఇలా మాట్లాడుతున్నాడా? అసలు ఆయనకీ ఏమైంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన ఏమి మాట్లాడాడో మీరే ఈ క్రింది వీడియోలో చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper