spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna- Honey Rose: బాలకృష్ణకు మ‌ల‌యాళీ భామను సెట్ చేసిన అనిల్ రావిపూడి

Balakrishna- Honey Rose: బాలకృష్ణకు మ‌ల‌యాళీ భామను సెట్ చేసిన అనిల్ రావిపూడి

Balakrishna- Honey Rose: టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాలయ్య బాబుతో సినిమా చేయబోతున్నాడు. అయితే, నటసింహం బాలయ్య కోసం హీరోయిన్ గా అనిల్ రావిపూడి మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ‌ను పట్టుకొచ్చాడు. ఆ ముద్దుగుమ్మ మరెవ‌రో కాదు.. ‘హ‌నీ రోజ్’. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ, ప‌లు మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, త‌మిళ‌ చిత్రాల్లో న‌టించి మెప్పించింది.

Balakrishna- Honey Rose
Balakrishna- Honey Rose

తెలుగులో కూడా ‘ఆల‌యం, ఈ వ‌ర్షం సాక్షిగా’ అనే చిత్రాల్లో హ‌నీ రోజ్ న‌టించింది. ఇప్పుడు ఏకంగా బాలయ్యతో రొమాన్స్ చేయబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఈమె పాత్ర‌కు మంచి ప్రాధాన్య‌త ఉంటుందట. మెయిన్ హీరోయిన్ గా నటిస్తోన్న తమన్నా ఓన్లీ ప్లాష్ బ్యాక్ లో మాత్రమే కనిపిస్తోంది.

Also Read: Janasena Chief Pawan Kalyan: పవన్ కు ఏపీ కంటే తెలంగాణపై ఎందుకంత ప్రేమ?

లైవ్ లో హ‌నీ రోజ్ కే ఎక్కువ స్క్రీన్ స్పెస్ ఉంది. అందుకే, బాలయ్య కొత్త సినిమాలో మెయిన్ హీరోయిన్ ఇప్పుడు హనీ రోజ్ అనే టాక్ నడుస్తోంది. హనీ రోజ్ 2005లో ‘బాయ్ ఫ్రెండ్’ అనే సినిమాతో వెండితెర పై అరంగేట్రం చేసింది. ఆమె చేసిన సినిమాల విషయానికొస్తే.. స్టార్ హీరోలు మోహన్ లాల్, మమ్ముట్టి, జయరాం, సురేశ్ గోపి సరసన ఆడిపాడింది.

Balakrishna- Honey Rose
Balakrishna- Honey Rose

ప్రస్తుతం బాలయ్య చిత్రంతో పాటు ‘పట్టామ్ పూచి’, ‘మాన్స్టర్’ సినిమాల్లోనూ హనీ రోజ్ నటిస్తోంది. నిజానికి అనిల్ రావిపూడి ఈ రోల్ కోసం చాలామంది హీరోయిన్ల పేర్లనే పరిశీలించాడు. హనీ రోజ్ అయితే, బడ్జెట్ లో వస్తోంది. పైగా తను రాసుకున్న పాత్రకు పూర్తి న్యాయం చేస్తోంది. గ్లామర్ పరంగానే కాకుండా నటన పరంగా కూడా హనీ రోజ్ లో మ్యాటర్ ఉంది. అందుకే, ఆమెను ఫైనల్ చేశాడు అనిల్ రావిపూడి.

మరి, బాలయ్య సినిమా హిట్ అయితే, టాలీవుడ్ కి మరో సాలిడ్ హీరోయిన్ దొరికినట్టే. ఈ సినిమా కోసం ఆమె ఇప్పటికే బల్క్ డేట్లు ఇచ్చింది. ఎప్పటి నుంచో బాలయ్యకి సరైన హీరోయిన్ దొరకడం లేదు. కానీ, హనీ రోజ్ లుక్ చూస్తుంటే.. ఈ దశాబ్దంలోనే బాలయ్యకి సరైన జోడి అనిపిస్తోంది. మరి ఈ కలయిక ఎలా ఉండబోతుందో చూడాలి. అనిల్ రావిపూడి మొత్తానికి బాలయ్య కోసం బాగానే కసరత్తులు చేస్తున్నాడు.

Also Read:Junior NTR: సినిమా పేరు ని తన ఇంటి పేరుగా పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్.. షాక్ లో ఫాన్స్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Oktelugu Epaper