వకీల్ సాబ్ ఇంత పెద్ద విజయం సాధించిందంటే ప్రధాన కారణం ఇద్దరే. అందులో మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కాగా.. రెండో వ్యక్తి ప్రకాష్ రాజ్. వీరిద్దరూ కొదమ సింహాల్లా కోర్టులో వాదించిన తీరు సినిమాను ఓ రేంజ్ లో నిలబెట్టింది.
సెకండాఫ్ మొత్తం పవన్ వర్సెస్ ప్రకాష్ రాజ్ వాదనలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ముఖ్యంగా ప్రకాష్ రాజు డైలాగులు.. వాటికి పవన్ కౌంటర్ ఇవ్వడం ఇలా సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇద్దరూ కొట్టుకునే వరకు వాదించుకోవడం విశేషం.
ఈ క్రమంలోనే వకీల్ సాబ్ లో ప్రకాష్ రాజ్ నటనకు ఫిదా అయిపోయిన చిరంజీవి తాజాగా ప్రకాష్ రాజ్ ను కలిశాడు. ‘నందాజీ’ పాత్రలో ప్రకాశ్ రాజ్ ఒదిగిపోయి నటించారని మెగా స్టార్ ప్రశంసించారు.
ఈ క్రమంలోనే పుష్పగుచ్ఛాన్ని అందించి అభినందించారు. సినిమాలో ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ లు నటించిన కోర్టులోని సీన్లు అద్భుతంగా పండాయని చిరంజీవి కొనియాడారు. ఇద్దరూ చాలా సేపు సినిమా విశేషాల గురించి అనుభూతులు పంచుకున్నారు.
When you have an actor of @prakashraaj 's caliber, it makes his fellow Artists to also up their game.
His performance in #VakeelSaab was absolutely amazing and he played a great counterpart to @PawanKalyan. Special Congrats to you and Keep rocking Prakash! pic.twitter.com/285EBmYKEz— Chiranjeevi Konidela (@KChiruTweets) April 12, 2021