Anil Ravipudi Successes: ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎలాంటి సినిమాలు నచ్చుతాయి. వాళ్ళు ఏ సినిమాలను రిసీవ్ చేసుకుంటారు అనేది అనిల్ రావిపూడి కి తెలిసినంత గొప్పగా ఇంకెవరికి తెలియదనే చెప్పాలి. ఆయన ఏ హీరోతో సినిమా చేసిన కూడా ఆ హీరోని తమ అభిమానులు ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారు అనేది ముందుగా కాలిక్యులేషన్స్ వేసుకొని మరి సినిమాలు చేస్తాడు. అందువల్ల అతడికి వరుస సక్సెస్ దక్కుతున్నాయి. ఇప్పటికి వరుసగా సంక్రాంతికి వచ్చి సక్సెస్ లను సాధిస్తున్న ఆయన సంక్రాంతి డైరెక్టర్ గా మారిపోయాడనే చెప్పాలి. ఇంకొకరకంగా చెప్పాలంటే రాజమౌళి తర్వాత వరుసగా తొమ్మిది విజయాలను సాధించిన దర్శకుడు కూడా అనిల్ రావిపూడి నే కావడం విశేషం… ఇక అనిల్ రావిపూడి ఇప్పుడు సంక్రాంతి సినిమాల బరిలో ఉన్నంతకాలం మేము మా సినిమాలను రిలీజ్ చేయలేము అంటూ చాలా మంది డైరెక్టర్లు భావిస్తున్నారట. ఇక ఈ విషయం మీద కొన్ని కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…రాజమౌళి సైతం గతంలో అనిల్ రావిపూడి టాలెంట్ గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. ఇక దానిమీద ఇప్పుడు అనిల్ రావిపూడి అభిమానులు కొంతమంది సంక్రాంతి పోటీలో అనిల్ రావిపూడి తో పాటు పోటీలో పాల్గొనడానికి రాజమౌళి సైతం సాహసించడం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కారణం ఏంటి అంటే అనిల్ రావిపూడి సినిమాలు ఫ్యామిలీ సినిమాలు పండక్కి అందరు ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలనుకుంటారు. కాబట్టి పండక్కి ఎంత పెద్ద సినిమా వచ్చిన ఎంత పెద్ద విజువల్ వండర్ ను తీసుకువచ్చిన కూడా వాళ్ళందరూ ఫ్యామిలీ సినిమాలను చూడాలనుకుంటారు.
కాబట్టి అనిల్ రావిపూడికే వాళ్ళు ముందు ఓటు వేస్తారు. ఇక మిగతా దర్శకుల సినిమాలను సెకండ్ ఆప్షన్ గా పెట్టుకుంటారు. అనిల్ సినిమా ఎలాగూ సూపర్ సక్సెస్ సాధిస్తుంది. కాబట్టి దాన్ని రిపీటెడ్ గా చూస్తూ ఎంజాయ్ చేయడానికి అభిమానులు ఇష్టపడుతుంటారు తప్ప వేరే సినిమాలు చూడడానికి వాళ్ళు పెద్దగా ఆసక్తి చూపించరు…
అందువల్లే స్టార్ డైరెక్టర్లు సైతం అనిల్ రావిపూడితో సినిమాలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు… ఒకరకంగా చెప్పాలంటే సంక్రాంతి బరిలో అనిల్ ఉంటే మేము ఉండలేము అంటూ మిగతా దర్శకులు ఓపెన్ గా చెప్పేస్తున్నారు…