Anil Ravipudi : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగిన విషయం మనకు తెలిసిందే. మరి ఏదీ ఏమైనా కూడా డైరెక్టర్స్ కూడా తనదైన రీతిలో సత్తా చాటుతూ హీరోలకు ఈ మాత్రం తగ్గకుండా మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. వాళ్లతో సినిమాలు చేయడానికి చాలామంది స్టార్ డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళలో అనిల్ రావిపూడి ఒకరు… ఇప్పటికే ఆయన చేసిన ఏడు సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఇక ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమా ఈరోజు రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ఇప్పటికే ఈ సినిమా మీద మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. అలాగే అక్కడక్కడ ప్రీమియర్ షోస్ ఏర్పాటు చేశారు. కాబట్టి వాటిని బట్టి చూస్తే ఈ సినిమా సక్సెస్ టాక్ ని సంపాదించుకున్న విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అది మినిమం గ్యారంటీ సినిమాగా వస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఎందుకంటే ఆయన చేసే ప్రతి సినిమా యావత్ ప్రేక్షకులందరిని మెప్పిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాయి. తద్వారా ఆయన సినిమాలకి ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తి ఉండడమే కాకుండా ఆయన చేసే సినిమాలను చూడటానికి యావత్ ప్రేక్షకులందరూ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.
ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పాడు. అదేంటంటే ఆయన సొసైటీలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారట. దాని నుంచే కొన్ని క్యారెక్టర్స్ ను తీసుకొని సినిమాలో ఇన్వాల్వ్ చేస్తూ కామెడీ ని రాస్తూ ఉంటారు. తద్వారా కామెడీ అనేది జెన్యూన్ గా ఉంటూ ప్రేక్షకులందరికి నచ్చుతుంది. అలాగే తనకు ఫెయిల్యూర్ అంటే చాలా భయం అంట.
ఒకసారి ప్లాప్ సినిమా వస్తే మనం ఎక్కడికో వెళ్ళిపోతుందనే ఉద్దేశ్యంతోనే ఆయన విపరీతంగా కష్టపడి అయిన సరే సక్సెస్ ని సాధించాలనే సంకల్పంతో ఉంటారట. అందువల్లే సక్సెస్ ని సాధిస్తూ ఉంటారని ఆయనే ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం… ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ 100% స్ట్రైక్ రేట్ తో సక్సెస్ ఫుల్ సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…