Anil Ravipudi Remuneration: నేటి తరం దర్శకులలో శ్రీనువైట్ల రేంజ్ కామెడీ సినిమాలను తియ్యగల సత్తా ఉన్న ఏకైక దర్శకుడు అనిల్ రావిపూడి..మన టాలీవుడ్ లో ఇప్పటి వరుకు అపజయం అనేదే ఎరుగని దర్శకులలో ఈయన కూడా ఒక్కరు..ఇప్పటి వరుకు ఈయన చేసిన పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ , F2 ,సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలుగా నమోదు చేసుకున్నాయి..దీనితో ఈ దర్శకుడికి ఫామిలీ ఆడియన్స్ లో ఒక్క బ్రాండ్ ఇమేజి ఏర్పడిపోయింది..ఇటీవల ఆయన దర్శకత్వం లో వచ్చిన F2 సీక్వెల్ F3 కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపిస్తుంది..తన మార్కు కామెడీ టైమింగ్ టేకింగ్ తో తీసిన ఈ సినిమాకి ఫామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కడుతున్నారు..కేవలం మూడు రోజుల్లోనే 32 కోట్ల రూపాయిల షేర్ ని సాధించిన ఈ చిత్రం, ఫుల్ రన్ లో 75 కోట్ల రూపాయిల వరుకు వసూలు చేస్తుంది అని అంచనా..ఇది ఇలా ఉండగా ఈ సినిమాని కేవలం హైదరాబాద్ సిటీ లోనే పది లక్షల మంది ప్రేక్షకులు వీక్షించినట్లు ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఈరోజు జరిగిన సక్సెస్ మీట్ లో తెలిపాడు.
Also Read: F3 OTT Release Date: F3 OTT రిలీజ్ డేట్ వచ్చేసింది
కాసేపు ఈ సినిమా వసూళ్ల టాపిక్ పక్కన పెడితే, ఈ సినిమాకి అనిల్ రావిపూడి తీసుకున్న పారితోషికం గురించి సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది..అదేమిటి అంటే ఈ సినిమాలో హీరోలు గా నటించిన వెంకటేష్ 15 కోట్ల రూపాయిలు మరియు వరుణ్ తేజ్ 7 కోట్ల రూపాయిలు పారితోషికంగా తీసుకోగా..అనిల్ రావిపూడి ఏకంగా 20 కోట్ల రూపాయిల పారితోషికం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..అనిల్ రావిపూడి కి ఫామిలీ ఆడియన్స్ లో ఉన్న బ్రాండ్ ఇమేజి కి మాత్రమే కాకుండా, ఇప్పటి వరుకు ఆయన తీసిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడమే ఇందుకు కారణం అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..అంతే కాకుండా ఈ సినిమాకి భారీ లాభాలు వస్తే, ఆ లాభాల్లో కూడా అనిల్ రావిపూడి కి వాటాలు వెళ్తాయి అంట..ప్రస్తుతం ఈ వార్త ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది..ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణ తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా ద్వారా ఆయన బాలయ్య లోని కామెడీ టైమింగ్ ని బయటకి తీసుకొని రాబోతున్నారు..అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.
Also Read: Nara Lokesh Padayatra: పాదయాత్రకు చిన్నబాబు సన్నాహాలు.. చంద్రబాబు భారీ యాక్షన్ ప్లాన్