Ram charan Shankar Title: టాలీవుడ్ లో ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఊపు ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..#RRR వంటి సెన్సషనల్ హిట్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించిన రామ్ చరణ్..ఆ సినిమా తర్వాత సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక్క సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఒక్క హీరో రెండు పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ఇమేజి ఉన్న హీరోలతో వరుస సినిమాలు చెయ్యడం ఇదే తొలిసారి..ఈ సినిమా కి ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు..నిర్మాతగా ఈ సినిమా ఆయనకీ 50 వ సినిమా..అందుకే ఖర్చుకి కూడా ఎక్కడ వెనకాడకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారు..ఇప్పటికే చాలా వరుకు షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియా లో లీక్ అవుతూ హల్చల్ చేస్తుంది..ఇప్పటికే రామ్ చరణ్ ఈ సినిమా లో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు అనే విషయం మన అందరికి తెలిసిందే..ఆయన లుక్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి కూడా.

Also Read: F3 OTT Release Date: F3 OTT రిలీజ్ డేట్ వచ్చేసింది
ఇప్పుడు ఈ సినిమా టైటిల్ కి సంబంధించి కూడా రోజుకో వార్త సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది..నిన్న మొన్నటి వరుకు ఈ సినిమాకి ‘సర్కారోడు’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి..కొన్ని విశ్వసనీయ వర్గాలు కూడా దీనిపై ఏకీభవించాయి..కానీ లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏంటి అంటే, ఈ సినిమాకి ఇప్పటి వరుకు ఎలాంటి టైటిల్ ని అనుకోలేదు అని..సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తలు అన్ని కేవలం గాసిప్స్ మాత్రమే అని..ఎవ్వరు వాటిని నమ్మొడు అని దిల్ రాజు ఇటీవల జరిగిన F3 ప్రొమోషన్స్ లో భాగంగా ఒక్క ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన ప్రశ్నకి సమాధానం గా చెప్పాడు..రామ్ చరణ్ – శంకర్ మూవీ అద్భుతంగా వస్తుంది అని , వింటేజ్ శంకర్ సార్ టేకింగ్ ని ఈ సినిమాలో చూస్తారు అని..వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నాము అని చెప్పుకొచ్చాడు దిల్ రాజు..థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమాలో రామ్ చరణ్ రాజకీయ నాయకుడిగా మరియు CBI ఆఫీసర్ గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
Also Read: Dasari Narayana Rao: ఎందర్నో హీరోలను చేశాడు.. కానీ, ఏ హీరో ఆయనను పట్టించుకోలేదు



[…] Also Read: Ram charan Shankar Title: రామ్ చరణ్ – శంకర్ మూవీ టైటిల… […]
[…] Also Read: Ram charan Shankar Title: రామ్ చరణ్ – శంకర్ మూవీ టైటిల… […]