Anil Ravipudi And Nagarjuna: హిట్ మిషిన్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి… ఆయన డైరెక్షన్లో వచ్చిన తొమ్మిది సినిమాలు సూపర్ సక్స్ లను సాధించడంతో ఇప్పుడు ఆయన చేస్తున్న పదోవ సినిమా మీద ప్రేక్షకులందరి చూపైతే ఉంది. 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి ఆయన చేస్తున్న ఈ ప్రయోగం చాలావరకు సక్సెస్ అయ్యే విధంగానే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మొత్తానికైతే అనిల్ రావిపూడి తను అనుకున్నది సాధించే విధంగానే ముందుకు దూసుకెళ్తున్నాడు. తను ఏదైతే పాయింట్ తీసుకున్నాడో ఆ పాయింట్ ను పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి ఆయన ఎప్పటికప్పుడు కసరత్తులు చేస్తూనే ఉంటాడు. ఇక ఆక్రమంలోనే సంవత్సరానికి ఒక సినిమా చొప్పున ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకుంటున్నాడు. తక్కువ టైమ్ సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తూ తన బ్రాండ్ నేమ్ కూడా పెంచుకుంటున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది ప్రొడ్యూసర్లు అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ లతో సినిమాలను చేసిన అనిల్ రావిపూడి నాగార్జునతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ముగ్గురు సీనియర్ హీరోలకు కూడా భారీ సక్సెస్ లను అందించాడు.
ఒక నాగార్జునకి సక్సెస్ ని అందిస్తే ఈ తరంలో ఉన్న దర్శకులలో నలుగురు హీరోలతో సినిమాలు చేసిన ఏకైక దర్శకుడిగా అనిల్ రావిపూడి నిలుస్తాడు. అలాగే నలుగురికి సక్సెస్ ని అందించిన హీరోగా కూడా తను నిలుస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. నిజానికి మన శంకర్ వరప్రసాద్ సినిమా తర్వాత అనిల్ రావిపూడి నాగార్జున తో సినిమా చేయాలి.
కానీ ఇప్పుడు నాగార్జున తన వందో సినిమా చేస్తున్నాడు. దాంతో తను బిజీగా ఉండడం వల్ల అనిల్ రావిపూడి కి డేట్స్ అయితే ఇవ్వలేకపోయాడు. అందువల్లే మరోసారి అనిల్ వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాగార్జునతో చేయబోయే సినిమా ఉండొచ్చు అని కొంతమంది కొన్ని అభిప్రాయాలనైతే వ్యక్తం చేస్తున్నారు…
