Anil Ravipudi: ప్రస్తుతం మన టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో అనిల్ రావిపూడి(Anil Ravipudi) పేరు ముందు వరుసలో ఉంటుంది. శ్రీను వైట్ల, సంతోష్ శ్రీనివాస్, విజయ్ భాస్కర్ వంటి టాప్ డైరెక్టర్స్ దర్శకత్వం వహించిన సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించే అనిల్ రావిపూడి, కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తొలిసినిమా తోనే భారీ కమర్షియల్ హిట్ ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన తీసిన ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘భగవంత్ కేసరి’, ‘ఎఫ్ 3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాల ద్వారా అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఆడియన్స్ లో బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.
ఇప్పుడు ఆయన మెగాస్టార్ చిరంజీవి తో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం తో మరో వారం రోజుల్లో మన ముందుకు రాబోతున్నాడు. ఇది కాసేపు పక్కన పెడితే, అనిల్ రావిపూడి గతం లో ఒక క్రేజీ మల్టీస్టార్రర్ చిత్రాన్ని రిజెక్ట్ చేసాడట. ఆ సినిమా మరేదో కాదు, వెంకటేష్, రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మసాలా’ చిత్రం. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నుండి ఈ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ అనిల్ రావిపూడి కి వచ్చిందట. కానీ ఈ ఆఫర్ ని ఆయన సున్నితంగా రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అందుకు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో వివరణ ఇస్తూ ‘మసాలా చిత్రాన్ని నేను రిజెక్ట్ చేయడానికి కారణం, దాని మాతృక ‘బోల్ బచ్చన్’ చిత్రాన్ని నేను చూసాను. ఇది పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా అనిపించింది. నా మొదటి సినిమా ఇలా ఉండకూడదు, కచ్చితంగా యాక్షన్ ఉండాలని అనుకున్నాను, అందుకే ఆ సినిమాని ఒప్పుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
కానీ ఆ చిత్రానికి కథ, డైలాగ్స్ మాత్రం అనిల్ రావిపూడి నే అందించాడు. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్, స్వయంవరం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని తెరకెక్కించిన విజయ్ భాస్కర్ ఈ చిత్రానికి దర్శకుడు. కమర్షియల్ గా ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. యావరేజ్ రేంజ్ లో ఆడింది. కానీ మాతృక ‘బోల్ బచ్చన్’ మాత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్. ఆరోజుల్లో ఈ సినిమా బాలీవుడ్ లో 168 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. హిందీ లో అభిషేక్ బచ్చన్, అజయ్ దేవగన్ లు చేసిన పాత్రలను, ఇక్కడ విక్టరీ వెంకటేష్, రామ్ పోతినేని చేశారు. వీళ్లిద్దరు కూడా కామెడీ కుమ్మేసారు కానీ, ఎందుకో ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవ్వలేకపోయారు