Rajasaab Preview Show: ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన రాజాసాబ్ సినిమా ఈ నెల 9 వ తేదన ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఇక అందులో భాగంగానే కొంతమంది సినిమా సెలబ్రిటీస్ కి సైతం ప్రివ్యూ షో వేశారట. ఇక వాళ్ళు చూసిన దాన్ని బట్టి ఈ సినిమా బాగుందని చెబుతున్న కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగా వచ్చేదని కొంతమంది చెబుతున్నారు. మొత్తానికైతే రాజాసాబ్ సినిమా ఒక మోస్తరు హిట్ అవుతుందేమో కానీ బ్లాక్ బస్టర్ అవ్వడం చాలా కష్టం అని సినిమా ఇండస్ట్రీ లో ఒక టాక్ అయితే నడుస్తుంది. ఈ సినిమా ప్రభాస్ కెరియర్ కి ఎంతలా ఉపయోగపడుతుందో తెలీదు. కానీ మారుతి కెరియర్ కి మాత్రం చాలా బాగా హెల్ప్ అవుతోంది. ఇక మొదట మారుతి పాన్ ఇండియా సినిమాలను కూడా తీయొచ్చు. వీలైతే బాలీవుడ్ హీరోలను సైతం డైరెక్షన్ చేసేయొచ్చు…
ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఘోస్ట్ గా కనిపించిన ఎపిసోడ్ ప్రేక్షకుల్లో భయాన్ని కలిగిస్తూనే ప్రభాస్ యాక్టింగ్ కి మనల్ని ఫిదా చేస్తారట…ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ కామెడీ కూడా అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు…ఇక సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు డల్ అయ్యాయని దానివల్ల సినిమా మీద కొంతవరకు నెగెటివ్ ఫీల్ కలిగే అవకాశాలు ఉన్నాయని మరికొంతమంది చెబుతున్నారు…
మొత్తానికైతే ప్రభాస్ ను చూడటానికి ఆయన అభిమానులు వేయి కన్నులతో ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఈ సంక్రాంతికి రచ్చ రచ్చ చేయబోతోందనేది మాత్రం చాలా క్లారిటీ గా తెలుస్తోంది…ఇక రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ మూవీ ట్రైలర్ కూడా వచ్చింది.
అది కూడా పెద్దగా ఎఫెక్టివ్ గా లేకపోవడంతో మరోసారి రాజాసాబ్ సినిమా మీదనే అంచనాలు భారీగా పెరిగిపోయాయి…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…ప్రస్తుతానికైతే రాజాసాబ్ మీద అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి…హై ఎక్పెక్టేషన్స్ ఈ సినిమాకి ప్లస్ అవుతాయా? మైనస్ అవుతాయా అనేది తెలియాల్సి ఉంది…