https://oktelugu.com/

Game Changer : ‘గేమ్ చేంజర్’ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి ఫుల్ రన్ లో ఎంత వసూళ్లను రాబట్టొచ్చు? ట్రేడ్ పండితుల లెక్కలు ఇవే!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' చిత్రం నిన్న భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలై నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : January 11, 2025 / 04:26 PM IST

    Game Changer

    Follow us on

    Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం నిన్న భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలై నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ ప్రభావం చాలా గట్టిగా పడుతుంది. కచ్చితంగా థియేట్రికల్ రన్ ఆశించిన స్థాయిలో ఉండదు అని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ చిత్రానికి మొదటి రోజు 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేవలం తెలుగు వసూళ్లతో ఈ చిత్రం సరిపెట్టలేదు. హిందీ లో కూడా దుమ్ములేపే ఓపెనింగ్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. రెండవ రోజు కూడా అదే జోరు. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకి నేడు 22 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. అంటే 2వ రోజు పూర్తి అయ్యే సమయానికి బుక్ మై షో యాప్ ద్వారా నాలుగు లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయి అన్నమాట.

    ట్రెండ్ చూస్తుంటే వచ్చిన నెగటివ్ టాక్ కి, జరుగుతున్న టికెట్ సేల్స్ కి అసలు సంబంధమే లేనట్టుగా అనిపిస్తుంది. రేపు విడుదలయ్యే ‘డాకు మహారాజ్’, 14 న రాబోయే సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలకు పొరపాటున ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం ‘గేమ్ చేంజర్’ బాక్స్ ఆఫీస్ వద్ద శివ తాండవం చేస్తుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. అంటే గ్రాస్ లెక్కల్లో చూస్తే 160 కోట్ల రూపాయిల పైమాటే. హిందీ వెర్షన్ లో వీకెండ్ వరకు ఎలాంటి డోకా లేదు అనిపిస్తుంది. మొదటి రోజు 8 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజు అంతకు మించిన వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

    ఇదే ట్రెండ్ రాబోయే పది రోజుల్లో చూపిస్తే ఈ చిత్రం కచ్చితంగా బాలీవుడ్ లో వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అవలీలగా దాటుతుందని అంటున్నారు. అదే జరిగితే ఇక్కడితో 260 కోట్ల రూపాయిలు వస్తుంది. కర్ణాటక తెలుగు, కన్నడ భాషలకు కలిపి ఫుల్ రన్ లో 20 కోట్ల రూపాయిల గ్రాస్, అదే విధంగా తమిళనాడు లో 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఓవరాల్ గా 320 కోట్ల రూపాయిలు, ఓవర్సీస్ లో 30 నుండి 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఫుల్ రన్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి ఈ చిత్రం 360 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.