https://oktelugu.com/

Anil Ravipudi : అనిల్ రియల్ ప్రేమకథలో సూపర్ ట్విస్ట్ …భార్య ఫ్రెండ్ ను ప్రేమించి చివరకు భార్య ను ఎలా పెళ్లి చేసుకున్నాడో తెలుసా…

దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీలో ఒక పది సినిమాలు తీస్తే అందులో రెండో లేదా మూడో హిట్ అవడం గగనం. కానీ ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి అని చెప్తే ఎవరైనా నమ్ముతారా. కానీ ఈ డైరెక్టర్ మాత్రం ఇప్పటివరకు తీసిన పది సినిమాలలో ఎనిమిది సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

Written By: , Updated On : January 25, 2025 / 06:30 PM IST
Anil Ravipudi Love Story

Anil Ravipudi Love Story

Follow us on

Anil Ravipudi : సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే కఠిన శ్రమ, పట్టుదల, కృషి ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో ఎవరి దశ ఎప్పుడు తిరిగి సక్సెస్ అవుతారో చెప్పలేము. దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీలో ఒక పది సినిమాలు తీస్తే అందులో రెండో లేదా మూడో హిట్ అవడం గగనం. కానీ ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి అని చెప్తే ఎవరైనా నమ్ముతారా. కానీ ఈ డైరెక్టర్ మాత్రం ఇప్పటివరకు తీసిన పది సినిమాలలో ఎనిమిది సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ డైరెక్టర్ మరెవరో కాదు లేటెస్ట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి. రచయితగా సినిమా రంగంలో కెరియర్ను మొదలుపెట్టిన అనిల్ రావిపూడి 2005 లో రిలీజ్ అయిన గౌతమ్ ఎస్ ఎస్ సి అనే సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్ గా మారాడు. కందిరీగ, శౌర్యం, శంఖం, దరువు, సుడిగాడు, ఆగడు, మసాలా, పండగ చేసుకో వంటి సినిమాలకు కథను, డైలాగ్ ను అందించాడు అనిల్ రావిపూడి. కానీ రచయితగా తనకు అనుకున్నంత గుర్తింపు లభించకపోవడంతో తానే డైరెక్టర్ గా మారాడు. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా పటాస్. అప్పటివరకు ఫ్లాపులతో సతమతమవుతున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కు పటాస్ సినిమాతో బిగ్గెస్ట్ ఇట్ ను అందించాడు అనిల్ రావిపూడి. ఈ విధంగా మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు. ఇక ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో వరుస ప్లాప్ లతో ఉన్నవారికి హిట్లు ఇవ్వడమే పనిగా పెట్టుకుని సినిమాలు చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు అనిల్ రావిపూడి సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ త్రీ, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు.

ఇప్పటికీ అనిల్ రావిపూడి సినిమా ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతుంది. ఈ 8 ఏళ్లలో 8 బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో పరాజయం అందుకొని దర్శకులలో రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి పేరు వినిపిస్తుంది. ఇది ఇలా ఉంటే నిజజీవితంలో కూడా అనిల్ హీరోనే అని చెప్పొచ్చు. ఆయన లవ్ స్టోరీ కూడా సినిమాకు మించిన కథతో ఉంటుంది. ఒక ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు. కాలేజీ చదువుతున్న రోజుల్లో మా బ్యాచ్ మొత్తం నలుగురు అమ్మాయిలు ఉన్న బ్యాచ్ వెనకాల పడేది. ఆ నలుగురు అమ్మాయిలలో ఒక అమ్మాయిని నేను ప్రేమించాను. కానీ అమ్మాయికి పెళ్లి అయిపోవడంతో నేను నిరాశ పడ్డాను.

ఆమె పక్కన ఉండే ఫ్రెండ్ భార్గవినే నేను పెళ్లి చేసుకున్నాను. సో భార్య ఫ్రెండ్ కు సైట్ కొడితే భార్య పడింది అంటూ సరదాగా తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. అయితే ఆ నలుగురు అమ్మాయిల్లో మొదట అనిల్ ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసిందట. కొన్ని నెలల తర్వాత భార్గవి అనిల్ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పిందట. దాంతో ఇరు కుటుంబాలను ఒప్పించి అనిల్, భార్గవి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు