Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లర్ గా తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి… ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప విజయాలను సాధించి పెడుతున్నాయి. ఇప్పటివరకు 9 సినిమాలను చేసిన ఆయన 9 సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించడం విశేషం… ఆయన సినిమాలు ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్స్ గా వచ్చి సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఇకమీదట ఆయన నుంచి రాబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది… ఇక కొంతమంది ఆయన సినిమాలు క్రింజ్ కామెడీతో ఉంటాయని కామెంట్స్ చేస్తుంటే మరి కొంతమంది మాత్రం రెండున్నర గంటల పాటు అతని సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు నెగెటివ్ కామెంట్స్ ని పట్టించుకోకుండా తన పంథాలో తను సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అందుకే అతనికి వరుసగా సక్సెసులైతే దక్కుతున్నాయి. ప్రస్తుతం తన పదోవ సినిమాని చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
ఇక ఇదంతా చూస్తున్న సినిమా మేధావులు అనిల్ రావిపూడి మరో 10 సంవత్సరాలపాటు ఇలాగే సినిమాలు చేసుకుంటూ వెళ్లినా కూడా అతనికి సక్సెస్ లు దక్కుతాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొంతమంది మాత్రం ఇంకో పది సంవత్సరాలు అనిల్ రావిపూడి ని ఇంకో 10 సంవత్సరాలు మనం ఇలాగే భరించారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ, సుకుమార్ లాంటి దర్శకుడు పాన్ ఇండియాలో తమ సత్తాను చాటుతూ తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నారు… మొత్తానికైతే ఆయన సినిమాలా వల్ల ఆయనకి, ఆ మూవీలో చేసిన హీరోకి తప్ప ఇండస్ట్రీకి ఎలాంటి ఉపయోగం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు… ఇక మరికొందరు మాత్రం ఆయన సినిమాలతో ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్ లో ఉంటున్నారు. కాబట్టి అతను అదే పంథాలో ముందుకు సాగుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు…