Anil Ravipudi Emotional Video: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని, కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ ని నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. ఈమధ్య కాలంలో ఏ సినిమాకు చూడనంత పాజిటివ్ టాక్ ఈ చిత్రానికి చూడడంతో అభిమానుల్లో ఆనందం మామూలు రేంజ్ లో లేదు. ఆనందం తో కన్నీళ్లు పెట్టుకుంటూ సోషల్ మీడియా లో పోస్టులు చేస్తున్నారు. సెప్టెంబర్ నెలలో పవన్ కళ్యాణ్ ఓజీ తో భారీ లెవెల్ బ్లాక్ బస్టర్ ని కొట్టడం, కేవలం నాలుగు నెలల గ్యాప్ లోనే పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ తో మరో భారీ బ్లాక్ బస్టర్ కొట్టడాన్ని చూసి, వింటేజ్ మెగా ఫ్యామిలీ హీరోలు మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసారు అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే డైరెక్టర్ అనిల్ రావిపూడి కి ఇది 9వ బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ ని పట్టుకొని సూపర్ హిట్స్ కొట్టడం లో అనిల్ ని మించిన డైరెక్టర్ ఎవ్వరూ లేరని మరోసారి ఈ చిత్రం తో రుజువు అయ్యింది. ఈ సినిమా హిట్ అవ్వడం తో నేరుగా ఆయన మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి, ఆయన్ని గట్టిగా హత్తుకొని కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ ఎమోషనల్ కి గురయ్యేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియో ని అనిల్ రావిపూడి సోషల్ మీడియా లో అప్లోడ్ చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ని చూసిన అభిమానులు, మమ్మల్ని మేము అనిల్ రావిపూడి స్థానంలో చూసుకుంటున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి ని అభిమానులు బాగా మిస్ అయ్యారు. ఆయనలోని నేచురల్ కామెడీ టైమింగ్ కనపడట్లేదు, చిన్నప్పటి నుండి మేము చూస్తూ పెరిగిన మెగాస్టార్ ఇది కాదే అని ఆయన ప్రతీ సినిమాకు అనుకునేవారు ఫ్యాన్స్, ఆడియన్స్.
అభిమానుల్లో ఉన్నటువంటి ఆ లోటు ని ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం వడ్డీ తో సహా తీర్చేసింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని అద్భుతాలు నెలకొల్పుతుందో చూడాలి. వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి ని ఇష్టపడని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు. ఏ హీరో అభిమాని అయినా మెగాస్టార్ చిరంజీవి నటనకు ముగ్దుడు అవ్వాల్సిందే. కాబట్టి ఈ సినిమా ఒక నెల రోజుల పాటు బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ చిత్రం ఫుల్ రన్ లో 350 కోట్ల నుండి 400 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల షేర్ ని కొల్లగొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు, చూడాలి మరి ఆ రేంజ్ కి ఈ చిత్రం వెళ్తుందా లేదా అనేది.
Sometimes, words aren’t needed at all ❤️#ManaShankaraVaraPrasadGaru pic.twitter.com/wWZ77wGUIH
— Anil Ravipudi (@AnilRavipudi) January 12, 2026