Angus Cloud Passed Away: టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు.. సినీ ఇండస్ట్రీ అంటేనే క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలుసు. కొందరు యాక్టర్స్ అభిమానుల దృష్టిలో కేవలం స్టార్స్ మాత్రమే కాదు వాళ్లని కుటుంబ సభ్యులుగా పరిగణిస్తారు. వారి జీవితంలో జరిగే ప్రతి మంచి చెడ్డ తమదే అన్న అభిప్రాయంతో భావోద్వేగానికి లోనవుతుంటారు. ప్రస్తుతం హాలీవుడ్ లో ఒక యువ హీరో మరణంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సరిగ్గా వారం క్రితం అతని తండ్రి చనిపోవడంతో బరువైన హృదయంతో తండ్రికి వీడ్కోలు చెప్పినా ఆ నటుడు ఈరోజు ఓక్లాన్ లోని తన ఫ్యామిలీ హౌస్ లో మరణించాడు. నిండా పాతికేళ్లు కూడా నిండని ఈ అరుదైన యాక్టర్ మరణం పై యావత్ హాలీవుడ్ సంతాపాన్ని తెలియపరుస్తుంది. ఆ యాక్టర్ ఎవరో కాదు 2019లో హెచ్.బి.ఓ హిట్ సిరీస్ యుఫోరియాతో తన నటన జీవితాన్ని ప్రారంభించిన అంగస్ క్లౌడ్.
అతని మరణం గురించి ధ్రువీకరించిన అతని ప్రతినిధి
కైట్ బెయిలీ…”ఈరోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తికి బరువైన హృదయంతో వీడ్కోలు చెప్పాల్సి వచ్చింది. అతను కేవలం ఒక కళాకారుడే కాదు. అభిమానుల మనసుకు అతను ఒక స్నేహితుడిగా ,సోదరుడిగా, కొడుకుగా చేరువైన వ్యక్తి అంగస్. అటువంటి వ్యక్తి ఈనాడు మనల్ని వీడి వెళ్లడం ఎంతో దుఃఖించదగ్గ విషయం. గత వారం అంగస్తంరి చనిపోవడంతో అతను తీవ్రమైన మనస్థాపానికి గురి అయ్యాడు. అంగస్ కోల్పోయింది అతని తండ్రినే కాదు ఒక గొప్ప స్నేహితుడిని కూడా. ఇప్పుడు ఇలా మరణం తిరిగి వాళ్ళిద్దరినీ పరలోకంలో కలుపుతుందని ఆశిస్తున్నాము.”అని పేర్కొన్నారు.
అయితే ఇంతవరకు అంగస్ మరణం వెనక అసలు కారణం ఏమిటి అనేది ఎవరికి తెలియదు. దీనికి సంబంధించి ఒకలాండో యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ చీఫ్ స్టాఫ్ మైఖేల్ హంట్ మాట్లాడుతూ “తమకు అందిన సమాచారం ప్రకారం ఉదయం 11:30 గంటలకు అత్యవసర వైద్య పరిస్థితి ఏర్పడడంతో అంస్ నివాసానికి చేరుకున్నామని.. అయితే తాము అక్కడికి వెళ్ళేటప్పటికి అతను మరణించినట్లు నిర్ధారించబడిందని “తెలిపారు
తండ్రి మరణం తర్వాత ఐర్లాండ్ నుంచి తిరిగి వచ్చిన అంగస్ తీవ్రమైన మానసిక ఒత్తిడితో పాటు సూసైడల్ థాట్స్ తో బాధపడినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
అంగస్ క్లౌడ్ కేవలం ఒక యాక్టర్ గానీ కాకుండా ఒక ఫ్యాషన్ ఐకాన్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అతను యుఫోరియాతో ఒక స్టైలిష్ డ్రగ్ డీలర్ గా అందరి మనసులు దోచుకున్నాడు. అందరికంటే భిన్నంగా జీరో షేవ్ హెయిర్ కట్ మరియు కిల్లర్ లుక్స్ తో అంగస్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే అతని మరణం నేపథ్యంలో ఇప్పుడు అతని మాజీ టాలెంట్ మేనేజర్ డియోమి కోర్డెరో డ్రగ్స్ విషయంలో అంతకుముందు అతనిపై చేసిన ఆరోపణలు తిరిగి వెలుగులోకి వచ్చాయి. మాదకద్రవ్యాల వ్యసనం ఉన్న అంగస్ అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకున్న తర్వాత …తనే స్వయంగా అతనికి ప్రధమ చికిత్స చేశానని. ఆ సమయంలో అతను తన ముఖం పైనే వాంతి చేసుకున్నాడని అప్పట్లో డియోమి చెప్పిన మాటలు ఇప్పుడు అంగస్ మరణం పై పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. కానీ ఇంకా అతని మరణం వెనుక అసలు కారణం వెలుగులోకి రాలేదు.