బన్నీ కోరిక కాదు అంటే ఏమిటి పరిస్థితి ?

అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా మోజులో ఉన్నారు. అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఐకాన్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ దిల్ రాజును మాత్రం ఇంకా టెన్షన్ లోనే పెట్టాడు బన్నీ. గత నాలుగు సినిమాల నుండి బన్నీ ఆలోచనా విధానం మారింది. తన సినిమాలన్నింటిలో తన గీతా ఆర్ట్స్ ను లేదా తన మిత్రులను ఇన్ వాల్వ్ చేస్తూ వస్తున్నాడు. కేవలం పార్టనర్ గా ఉండటం వల్లే ‘అల వైకుంఠపురంలో’ సగం లాభాల్లో […]

Written By: admin, Updated On : June 28, 2021 8:57 am
Follow us on

అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా మోజులో ఉన్నారు. అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఐకాన్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ దిల్ రాజును మాత్రం ఇంకా టెన్షన్ లోనే పెట్టాడు బన్నీ. గత నాలుగు సినిమాల నుండి బన్నీ ఆలోచనా విధానం మారింది. తన సినిమాలన్నింటిలో తన గీతా ఆర్ట్స్ ను లేదా తన మిత్రులను ఇన్ వాల్వ్ చేస్తూ వస్తున్నాడు. కేవలం పార్టనర్ గా ఉండటం వల్లే ‘అల వైకుంఠపురంలో’ సగం లాభాల్లో గీతా అర్త్స్ తీసుకొంది.

అలాగే ప్రస్తుతం చేస్తోన్న ‘పుష్ప’ సినిమా లాభాల్లో కూడా కొంత బన్నీ స్నేహితులకు వెళ్తుంది. ఇప్పుడు ‘ఐకాన్’ సినిమా పరిస్థితి కూడా అలాగే ఉంది. గీతా ఆర్ట్స్ సంస్థని ఐకాన్ సినిమా నిర్మాణంలో ఇరికించే ఆలోచనలో బన్నీ ఉన్నాడని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు దిల్ రాజు అసలు అంగీకరించేలా లేడు. దిల్ రాజుది పెద్ద బ్యానర్. గీతా ఆర్ట్స్ భాగస్వామ్యం ఆయనకు అవసరం లేదు.

పైగా ఇప్పటికే అల్లు అరవింద్, దిల్ రాజు హిందీలో ‘జెర్సీ’ రీమేక్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో పెట్టిన డబ్బుకు చూపించిన లెక్కలకు మధ్య వ్యత్యాసం ఉందనేది దిల్ రాజు అనుమానం. అందుకే ‘ఐకాన్’లో పార్ట్నర్ షిప్ కి దిల్ రాజు ఒప్పుకోరు అని తెలుస్తోంది. కాకపోతే, హీరోతో ఎలా చెప్పాలి అన్నదే దిల్ రాజు ముందు ఉన్న అతి పెద్ద సవాలు.

ఎలాగూ దర్శకుడిగా శ్రీరామ్ వేణు ఫైనల్ అయ్యాడు. నిజానికి వేణుతో సినిమా చేయడం బన్నీకి ఇష్టం లేదు. పాన్ ఇండియా డైరెక్టర్ తో సినిమా చేస్తే తన మార్కెట్ పరిధి పెరుగుతుందని బన్నీ ఫీల్ అవుతున్నాడు, కానీ ‘ఐకాన్’ సినిమాని రెండేళ్ల క్రితం ప్రకటించారు బన్నీ. దాదాపు రెండేళ్లు వెయిట్ చేయించి, ఇప్పుడు కుదరదు అంటే బాగోదు అనే ఒకే ఒక్క రీజన్ తో బన్నీ ఈ సినిమా చేయడానికి అంగీకరించాడు. ఇప్పుడు దిల్ రాజు, బన్నీ కోరిక కాదు అంటే ఏమిటో పరిస్థితి ?