Game changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అభిమానులు రామ్ చరణ్ సినిమా కోసం సుమారుగా ఆరేళ్ళ నుండి ఎదురు చూస్తున్నారు. #RRR , ఆచార్య వంటి చిత్రాలు వచ్చినా అవి కేవలం మల్టీస్టార్రర్ చిత్రాలు మాత్రమే. సోలో హీరో గా ఇన్నేళ్ల తర్వాత చేస్తున్న సినిమా మాత్రం ‘గేమ్ చేంజర్’. ఇప్పటికే ఈ చిత్రం నుండి పాటలు, టీజర్ విడుదలై ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. శంకర్ నుండి ఈసారి మినిమం గ్యారంటీ రేంజ్ సినిమా వస్తుందని బలమైన సంకేతాలు ఇచ్చింది ఈ చిత్రం. అయితే ఈ సినిమాకి ‘పుష్ప 2’, ‘దేవర’ రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయా రావా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. ఎందుకంటే గత నెల రోజులుగా తెలంగాణాలో ఏమి జరుగుతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం.
సంధ్య థియేటర్ పుష్ప 2 ప్రీమియర్ షో లో రేవతి అనే మహిళ చనిపోవడం. ఆమె కొడుకు శ్రీతేజ్ కి తీవ్రమైన గాయాలై ఇప్పటికీ హాస్పిటల్ లో చికిత్స పొందడం వంటివి జరుగుతున్నాయి. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా ఫైర్ అయ్యి స్పందించడం, అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం వంటి ఘటనలు జరిగిన తర్వాత బెనిఫిట్ షోస్ పై జనాల్లో ఒక నెగటివ్ అభిప్రాయం ఏర్పడింది. ఆ ప్రభావం ఒక్క తెలంగాణాలో మాత్రమే కాదు, ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావడం, సినిమాటోగ్రఫీ శాఖ జనసేన తోనే ఉండడం వల్ల ఈసారికి బెనిఫిట్ షోస్ కి అనుమతి కచ్చితంగా దొరుకుతుంది. కానీ మరో అంశం ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ చిత్రం వసూళ్లపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే గతంలో సంక్రాంతి సెలవులు జనవరి 10 నుండి మొదలై 19 వ తేదీ వరకు కొనసాగేది. కానీ ఈసారి మాత్రం సెలవులు కుదించే ఆలోచనలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. జనవరి 11న పండగ సెలవులు మంజూరి చేసి, 15 కి ముగించాలని, లేదా 12 న ప్రారంభించి 16 కి ముగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే సెలవు దినాలు తక్కువ అవ్వడం వల్ల, గేమ్ చేంజర్ చిత్రానికి కనీసం పది నుండి 20 కోట్ల రూపాయిల వసూళ్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయం ప్రభుత్వం అధికారికంగా ఇంకా తీసుకోలేదు కానీ, తీసుకునే అవకాశాలు గట్టిగా ఉన్నాయని మాత్రం ప్రచారం జరుగుతుంది. ఒకపక్క తెలంగాణ లో టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్ లేక, మరోపక్క ఆంధ్ర ప్రదేశ్ లో పండుగ సెలవులు తక్కువ అవ్వడం వంటివి చూస్తుంటే ‘గేమ్ చేంజర్’ పై చాలా గట్టి ప్రభావం పడేలాగానే అనిపిస్తుంది.