Fake Websites: ప్రస్తుతం ఈరోజుల్లో టెక్నాలజీని ఉపయోగించి నిమిషాల్లో, సెకండ్లలో మోసాలు జరిగిపోతున్నాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచం నలుమూలల ఎక్కడ ఏం జరిగినా కూడా అది మంచిదైనా, లేదా చెడైనా సెకండ్లలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిపోతుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పుడు నుంచి ఎక్కడ ఏం జరుగుతుందో అనే దానిమీద అందరికీ అవగాహన కూడా బాగా పెరిగింది. అయితే ఇప్పుడున్న ఈ టెక్నాలజీ తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అలాగే నష్టాలు కూడా ఉన్నాయని ఇలాంటి వార్తలు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడున్న ఈ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని చాలామంది సైబర్ నేరానికి పాల్పడుతున్నారు. పెరిగిన టెక్నాలజీని ఉపయోగించుకుని రోజుకో కొత్త మోసానికి తెలలేపుతున్నారు సైబర్ కేటుగాళ్లు. డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకుల దగ్గర నుంచి లక్షలకు లక్షలు డబ్బులు కాజేయడం, అలాగే బ్యాంకు పేరుతో మోసాలు ఇలాంటి వార్తలు ప్రతి రోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త సైబర్ మోసం అందరికీ షాప్ కి గురిచేస్తుంది. కొంతమంది సైబర్ కేటుగాళ్లు ప్రభుత్వ మీసేవ పేరుతో ఒక నక్లీ వెబ్సైట్ను ప్రారంభించి మోసానికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ మీసేవ వెబ్ సైట్ meeseva.telangana.gov.in. ఇది తెలంగాణ ప్రభుత్వ అధికారిక మీసేవ వెబ్సైట్. అయితే కొంతమంది meesevatelangana.in అనే పేరుతో ఒక నకిలీ వెబ్సైట్ను సృష్టించారు. దీంట్లో కొత్తగా మీసేవ కేంద్రాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు HYD కలెక్టర్ పేరుతో ఫీజు వివరాలను ప్రకటించడం జరిగింది.
ఈ ప్రకటన చూసి చాలామంది ఆన్ లైన్ లో ఫీజు చెల్లింపులు కూడా చేశారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో ఈ ఘటనపై సైబర్ సెల్ దర్యాప్తును చేపట్టింది. నకిలీ వెబ్సైట్ను సైబర్ సెల్ బ్లాక్ చేసింది. ప్రజలు ఇలాంటి ఆన్లైన్ కేటుగాళ్ల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని అలాగే తెలియని వ్యక్తులకు చెల్లింపులు చేసే విషయంలో పలు జాగ్రత్తలను తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనలను ఉపయోగించుకొని ఫేక్ వీడియోలు చేయడం, వాయిస్ క్లోనింగ్, సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించి ప్రజలను మోసం చేయడం చాలా ఆందోళనకరంగా మారింది.
సోషల్ మీడియా మాధ్యమాలలో విరాట్ కోహ్లీ, అమితాబచ్చన్, సచిన్ టెండుల్కర్, రష్మిక మందన ఇలా పలువురు ప్రముఖుల పేర్లను కూడా వాడుకుంటూ డీప్ ఫేక్ ల ద్వారా ప్రజలను నమ్మించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కొంత మంది తమకు ఇష్టమైన ఇద్దరు సెలెబ్రెటీలకు పెళ్లి జరిగినట్లు ఫోటోలు క్రియేట్ చేసి సోషల్ మీడియా లో వైరల్ చేసేస్తున్నారు. ఇక గతం లో హీరో ప్రభాస్, అనుష్క కు పెళ్లి జరిగినట్లు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ద్వారా ఫోటోలు క్రియేట్ చేసి వైరల్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.